NTV Telugu Site icon

Deadpool & Wolverine Review: డెడ్ పూల్ వాల్వరిన్ రివ్యూ.. కుర్చీ మడత పెట్టాడా? లేదా?

Deadpool & Wolverine

Deadpool & Wolverine

Deadpool & Wolverine Review: మార్వెల్ సిరీస్ సినిమాలను అభిమానించే ప్రేక్షకులు, అభిమానులకు డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అమెరికన్ సూపర్ హీరోల నేపథ్యంగా సాగే మార్వెల్ కామిక్ పాత్రలతో కూడిన ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్, మాగ్జిమమ్ ఎఫర్ట్, 21 లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. నిజానికి మార్వెల్ సినిమాలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళని మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ట్రైలర్ ముఖ్యంగా తెలుగు ట్రైలర్ ఉండడంతో తెలుగు ప్రేక్షకులలో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. జూలై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులలో ఏర్పడిన అంచనాలు అందుకు ఉందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ కథ: గర్ల్ ఫ్రెండ్ వెనేసాతో బ్రేకప్ తర్వాత వేడ్‌ విల్సన్‌ అలియాస్ డెడ్‌పూల్(ర్యాన్‌ రేనాల్డ్స్‌) సెకండ్‌ హ్యాండ్‌ కార్ల సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఇక డెడ్‌పూల్ పుట్టిన రోజున.. టైమ్ వేరియన్స్ అథారిటీలో ఒక ప్రాంత అధికారి పారాడాక్స్ టీం అతడిని ఎత్తుకెళ్లి.. ఎర్త్ 616లో జాయిన్ అవ్వమంటారు. అయితే పారాడాక్స్ నుంచి టెమ్ ప్యాడ్ దొంగలించి మల్టీవర్స్‌కు వెళ్లి లోగన్ వేరియెంట్‌ను సేవ్ చేయాలని డెడ్ పూల్ ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో లోగన్‌తో కలిసి వేడ్ ఏం చేశాడు? మల్టీవెర్స్‌లో ఈ ఇద్దరూ కలిసి ఎలాంటి సాహసాలు చేశారు? మరో లోకంలోకి విసిరివేయబడ్డ కాసాండ్రను ఎలా ఎదుర్కొన్నారు? చివరకు ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ?:
నిజానికి ఈ మార్వెల్ సినిమాలు చూడాలంటే గతంలో వచ్చిన మార్వెల్ సినిమాలు చూడాల్సి ఉంటుంది. కానీ తెలుగులో చేసిన డబ్బింగ్ తో ఈసారి సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. ఇక సినిమా మొదలయ్యాక డెడ్‌పూల్ అలియాస్ వేడ్ విల్సన్‌గా ర్యాన్ రెనాల్డ్స్ తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో వినోదాన్ని పండించాడు. లోగన్ అలియాస్ వాల్వరిన్‌తో కలిసి యాక్షన్, ఫన్, కామెడీ అనే తేడా లేకుండా తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు రఫ్ ఆడించాడు. కసండ్రా(ఎమ్మా కోరిన్) ఎంట్రీ తర్వాత సినిమా యాక్షన్ మోడ్‌లో వెళ్లి మరింత రక్తి కట్టించింది. ఇక సెకండాఫ్‌లో ఫన్, యాక్షన్ ఎలిమెంట్స్‌తోపాటు ఎమోషనల్ సీన్లు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ప్రీ క్లైమాక్స్ కొంత నిరాశపరుసుతన్ది. ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మర్వెల్ సినిమాల్లో ఉండే గ్రాఫిక్ వర్క్ స్టాండర్డ్స్ ఇందులో తగ్గాయి అనిపించింది. అయితే కెమెరా, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. అయితే ముఖ్యంగా డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ సినిమా తెలుగు వెర్షన్ మాత్రం డైలాగ్స్‌తో కడుపుబ్బ నవ్వించారు కానీ కాస్త అడల్ట్ కామెడీ అనిపించిహ్న్ది. హాలీవుడ్ సినిమాను పూర్తిగా తెలుగు నేటివిటికి కనెక్ట్ చేసి కుర్చీ మడతపెట్టి, కోడికత్తి లాంటి డైలాగులతో తెలుగు ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

ఫైనల్లీ ఈ డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ సినిమా మల్టీవర్స్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన పైసా వసూల్ యాక్షన్ విత్ ఫన్ జానర్ మూవీ. తెలుగు వెర్షన్ చూస్తే ఫుల్ ఖుషీ అవుతారు. కానీ ఏ సర్టిఫికెట్ బాసూ!

Show comments