నాలుగు దశబ్దాలకు పైగా సాగుతున్న తన సినీ ప్రస్థానంలో నటుడిగా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్న మోహన్ లాల్ ఫస్ట్ టైమ్ ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు అనగానే ఆ సినిమాపై అంచనాలు పెరడగం సహజం.పైగా అది కూడా పూర్తిగా 3D లో షూట్ చెయ్యడం,ఆరు సంవత్సరాలుగా ఆ సినిమాపై వర్క్ చెయ్యడం,పాన్ ఇండియాతో పాటు మరిన్ని భాషల్లో కూడా ఆ సినిమాని రిలీజ్ చేస్తుండడంతో బరోజ్ పై బజ్ ఏర్పడింది.మరి క్రిస్మస్ కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.
కథ :
1663 సమయంలో పోర్చుగీసు నుంచి ఇండియాకి వచ్చి స్థిరపడిన రాజకుటుంబం అయినటువంటి డ గామా రాజుల దగ్గర ఎంతో విధేయుడిగా ఉంటాడు బరోజ్(మోహన్ లాల్). అయితే ఆ డ గామా ఒక యుద్ధ సమయంలో తన వద్ద ఉన్న భారీ నిధికి కాపలాగా ఉండాలి అని బరోజ్ కి చెప్పి ,నెల రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తాను అని ఆ రాజు వెళ్ళిపోతాడు.ఆ క్రమంలో ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడిన బరోజ్ అప్పటినుండి ఆ నిధికి కాపలా కాస్తుంటాడు.ఈ క్రమంలో బరోజ్ కి ఏమయ్యింది. తాను ఆ రాజకోటలో భూతంగా 400 ఏళ్ళు పాటు ఎలా ఉండాల్సి వచ్చింది? ఆ నిధిని కాజేయడానికి యత్నించింది ఎవరు? బరోజ్ కి విడుదల లభిస్తుందా లేదా? డగామా వారసురాలు ఇసబెల్లాతో బరోజ్ అనుబంధం ఎలాంటిది? ఆ నిధి ఆఖరికి ఏమయ్యింది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
రాజమౌళి పుణ్యమా అని ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై లార్జర్ దేన్ లైఫ్ సినిమాలు అడపా దడపా దర్శనం ఇస్తున్నాయి.బడ్జెట్ కి వెనుకాడకుండా క్వాలిటీగా సినిమా తీసి దాని స్థాయిని బట్టి పాన్ ఇండియా లేక పాన్ వరల్డ్ రిలీజ్ చేసి కమర్షియల్ సక్సెస్ కూడా చూస్తున్నారు ఇండియన్ మేకర్స్. బరోజ్ అనే సినిమా నిర్మాణం వెనుక కూడా ఇలాంటి స్ట్రాటజీనే ఉంది.చాలా చిన్న ఇండస్ట్రీ అయిన మలయాళంలో పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు కూడా లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కుతాయి.కానీ ఈ సినిమాని మాత్రం చాలా పెద్ద బడ్జెట్ తో,దేశంలోనే తొలిసారిగా 3D టెక్నాలజీ వాడుతూ షూట్ చేసారు.అలాగే ఈ సినిమాలో గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ కి చాలా స్కోప్ ఉంది.
బరోజ్… ది గార్డియన్ ఆఫ్ డగామా ట్రెజర్ అనే బుక్ ఆధారంగా తెరెకెక్కించారు.ఇలాంటి ఒక ఫాంటసీ వరల్డ్ రాయడం తెలికే కానీ దాన్ని విజువల్ గా చూపించాలంటే చాలా కష్టం.అందుకే ఈ సినిమాని తెరకెక్కించడానికి,ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆరేళ్ళ సమయం పట్టింది.
అయితే ఈ సినిమా విజువల్ గా, 3D ఎఫెక్ట్స్ పరంగా బావుంది.కానీ నేటివిటీ పూర్తిగా మిస్ అవ్వడం,కథనం నత్తనడకన సాగడం అనేది ఈ సినిమాకి పెద్ద మైనస్.పైగా కథ అంతా కూడా సింగిల్ పాయింట్ పై నడుస్తుంది.దాంతో ఫస్ట్ హాఫ్ భారంగా గడుస్తుంది.సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి బరోజ్,ఇసబెల్లా మధ్య సాగిన ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ మాత్రం మెప్పిస్తుంది.కథ గోవా బేస్డ్ గా జరుగుతుండడం, 400 సంవత్సరాల క్రితం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కూడా ఉండడంతో అప్పటి పోర్చుగీస్ కల్చర్ ని,కింగ్ థీమ్ ని చాలా రిచ్ గా ప్రెజెంట్ చేసారు.ఈ క్రమంలో సినిమాని రిలేట్ చేసుకోవడానికి ఇబ్బందిగా మారింది.పైగా ఆ పోర్చుగీస్ సెటప్ లో అంతా కూడా పోర్చుగీస్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుంటారు.దాంతో సినిమాతో కనెక్ట్ కావడం మరింత కష్టంగా మారింది.
అలాగే బరోజ్ భూతం కావడం వల్ల చాలా సీన్స్ ఓవర్ ఫాంటసీగా అనిపిస్తాయి.అలాగే సినిమాలో ఎక్కడా కూడా ఆ భూతంకి పెద్దగా సవాల్ విసిరే సమస్యలు ఉండవు.కేవలం ఎమోషనల్ ప్లే మాత్రమే ఉంటుంది.దానికి తోడు డబ్బింగ్ లో సైతం అక్కడక్కడా మోహన్ లాల్ ఒరిజినల్ వాయిస్ వాడడం ఇబ్బందిగా అనిపిస్తుంది.ఎంతో కష్టపడి చేసిన పాటలు ఈ సినిమాకి మరొక పెద్ద మైనస్.ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా పిల్లలకు నచ్చే ఒక ఫాంటసీ డ్రామా అని చెప్పుకోవచ్చు.
నటీనటుల విషయానికి వస్తే మోహన్ లాల్ బరోజ్ పాత్రలోని ఫీల్ ని పూర్తిగా నరనరానా నింపుకుని నటించినట్టు అనిపిస్తుంది.ఆ పాత్ర కోసం ఆయన మేకోవర్ అయిన తీరుకి హ్యాట్సాఫ్.ఇక మిగతా నటులు కూడా తమ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేసారు.స్క్రిప్ట్ పరంగా జరిగిన లోపాలవల్ల మంత్రగత్తె పాత్ర కొంచెం ఓవరాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది.
ఈ సినిమాకి డైరెక్టర్ అయిన మోహన్ లాల్ సినిమా నిర్మాణ సమయంలో వచ్చిన ఇబ్బందులు అధిగమించి తాను అనుకున్న కథని తెరెకెక్కించడంలో సఫలం అయ్యాడు. కానీ ఆ కథని ప్రేక్షకులకు కనెక్ట్ చెయ్యడంలో ఒక స్టోరీ టెల్లర్ గా పూర్తిగా న్యాయం చెయ్యలేకపోయాడు.సంగీతం, ఆర్ట్ ఈ సినిమాకి పీరియాడిక్ ఫీల్ తీసుకురావడానికి బాగా ఉపయోగపడ్డాయి.ఇక కెమేరామ్యాన్ కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.విజువల్స్ పరంగా పేరు పెట్టడానికి లేదు.మూడు,నాలుగు లొకేషన్స్ లో చేసినా కూడా సినిమాలో యూనిఫార్మిటీ ఉండేలా చూసుకోవడంలో సక్సెస్అయ్యాడు.ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాని నిర్మాత నమ్మకానికి, గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఫైనల్ గా చెప్పాలంటే అలరించలేకపోయిన సరికొత్త ఫాంటసీ ప్రపంచం