Badmashulu Review: బద్మాషులు రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్ రెడ్డి, కవిత శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్, అన్షుమన్ తదితరులు
- DIRECTOR: శంకర్ చేగూరి
- MUSIC: తేజ కూనూరు
- PRODUCER: B. బాలకృష్ణ, C.రామ శంకర్
‘బద్మాషులు’.. తెలంగాణ ప్రాంతంలో ప్రేమగా తిట్టే తిట్టు ఇది, ఒకరిని అయితే బద్మాష్ అని ఒకరికన్నా ఎక్కువ అయితే ‘బద్మాషులు’ అని పిలుస్తారు. అదే టైటిల్‌లో ఓ సినిమా తెరకెక్కించారు. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాని శంకర్ చేగూరి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో ఈ చిన్న సినిమా మీద అందరి దృష్టి పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.
‘బద్మాషులు’ కథ.
తెలంగాణలోని కోతులగూడెంకి చెందిన ట్రైలర్ తిరుపతి(మహేశ్ చింతల), బార్బర్ ముత్యాలు(విద్యాసాగర్ కారంపురి) క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరికీ బద్ధకం కావడంతో పని మానేసి తిరుగుతూ మందేస్తూ ఉంటారు. భార్య, పిల్లలను పట్టించుకోకుండా తాగుతూ ఉండెవీరిని ఊరంతా ‘బద్మాషులు’ అని తిడుతూ ఉంటారు. ఓ సారి తాగేందుకు డబ్బుల్లేక స్కూల్‌లో ఓ వైర్‌ని దొంగిలించి పోలీసులకు దొరికిపోతారు. అదే సమయంలో స్కూల్‌లో కంప్యూటర్ మిస్ కావడంతో అందులో పూర్వ విద్యార్థుల డేటా అంతా ఉంటుంది. ఆ కేసు వీరిద్దరిపై పడుతుంది. అయితే అసలు ఆ కంప్యూటర్ దొంగిలించిదెవరు? దొంగను పట్టుకునేందుకు కానిస్టేబుల్ రామచందర్(మురళీధర్ గౌడ్)కు తిరుపతి, ముత్యాలు ఎలా సహాయపడ్డారు? ఈ తిరుపతి, ముత్యాలు తాగుబోతులుగా మారడానికి గల కారణం ఏంటి? చివరకు వీరిద్దరిలో మార్పు వచ్చిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
విశ్లేషణ
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఒక సరదా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేలా రాసుకున్నారు. కథ మొత్తం ఇద్దరు తాగుబోతులు, తిరుపతి మరియు ముత్యాలు చుట్టూ తిరుగుతూ, వారి చేష్టలతో నవ్వులు పండించేలా రాసుకున్నారు. ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్ర నిజజీవితంలో మన ఊళ్లో కనిపించే వ్యక్తులను పోలి ఉంటూ, సహజత్వంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే, దర్శకుడు కథ కంటే కామెడీ సన్నివేశాలపై ఎక్కువ దృష్టి సారించాడు. కొన్ని సన్నివేశాలు ‘జాతిరత్నాలు’ ఛాయలను గుర్తు చేస్తాయి. కథ ఒకే పాయింట్ చుట్టూ తిరగడంతో, నిడివి తక్కువగా ఉన్నా సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల కామెడీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. పాత్రల పరిచయ సన్నివేశాలు మాత్రం నవ్వులు పూయిస్తాయి. డ్రెస్ కుట్టమని ఇచ్చిన వస్త్రాన్ని అమ్ముకొని తాగే తిరుపతి, సగం షేవింగ్ చేసి మధ్యలో తాగడానికి వెళ్లే ముత్యాలు ఇలా వారి పరిచయ వంటి సన్నివేశాలు హాస్యాన్ని రేకెత్తిస్తాయి. అయితే, ఇలాంటి పాత్రలతో మరింత హాస్యాన్ని పండించే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు రోటీన్ సన్నివేశాలకే పరిమితమయ్యాడు, ఇవి కొంతవరకు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక కథ దొంగతనం చేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లే వరకు సాధారణంగా సాగినా స్టేషన్‌లో తిరుపతి, ముత్యాలు చేసే కామెడీ నవ్వులు రేపుతుంది. సెకండ్ హాఫ్‌లో కూడా కథ మళ్లీ దొంగతనం చుట్టూ తిరగడంతో కొంత బోరింగ్‌గా అనిపిస్తుంది. దొంగను పట్టుకునే ప్రయత్నాలు అంతగా ఆకర్షించవు. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేసేలా ఉంటుంది. వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్‌కు అనుగుణంగా రూపొందించిన విషయంలో దర్శకుడిని అభినందించచ్చు. ఈ కథను మరింత బలంగా రాసుకొని, కామెడీ సన్నివేశాలను ఇంకాస్త పదునుగా రూపొందించి ఉంటే ఈ సినిమా వేరే స్థాయిలో ఉండేదేమో.
ఎవరెలా చేశారంటే..
నటీనటుల విషయానికి వస్తే ‘బలగం’, ‘భీమదేవరపల్లి’, ‘రామన్న యూత్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలతో మెప్పించిన విద్యా సాగర్ ఈ సినిమాతో హీరోగా మారి, తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బార్బర్ ముత్యాలు పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి, కొన్ని సన్నివేశాల్లో తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వులు రేపాడు. అలాగే, ట్రైలర్ తిరుపతి పాత్రలో మహేష్ చింతల కూడా సహజమైన నటనతో ఆకర్షించాడు. ఇక విద్యా సాగర్, మహేష్ ఇద్దరూ తెరపై నిజమైన తాగుబోతులుగా కనిపించి, పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముత్యాలు భార్యగా దీక్ష కోటేశ్వర్, తిరుపతి భార్యగా కవిత పాత్రలు పరిమిత స్థాయిలో ఉన్నప్పటికీ ఉన్నంతలో ఆకట్టుకున్నారు. మురళీ ధర్, బలగం సుధాకర్ రెడ్డితో సహా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు తగినట్టు నటించారు. సాంకేతికంగా ఈ సినిమా విషయానికి వస్తే తేజ కూనూరు అందించిన నేపథ్య సంగీతం చిత్రానికి బలాన్ని చేకూర్చింది. పాటలు మామూలుగానే ఉన్నాయి. వినీత్ పబ్బతి సినిమాటోగ్రఫీ, గజ్జల రక్షిత్ కుమార్ ఎడిటింగ్ సినిమా నాణ్యతకు తోడ్పడ్డాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
ఫైనల్లీ తెలంగాణ గ్రామీణ హాస్యాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ సినిమా ఒక ఆప్షన్.
- Tags
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!