O Saathiya Movie review : టాలెంట్ ఉంటే చిన్న సినిమానా? పెద్ద సినిమానా అనేది కూడా చూడకండా నెత్తిన పెట్టేసుకుంటునాన్రు మన తెలుగు ప్రేక్షకులు. అందుకే కొత్త వారు కూడా సినీ పరిశ్రమలో తమ లక్ చెక్ చేసుకుంటున్నారు. అలా ఈ వారం కొత్త హీరో, కొత్త లేడీ డైరెక్టర్ కాంబోలో తెరకెక్కిన ఓ సాథియా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటించగా దేవీ ప్రసాద్, అన్నపూర్ణమ్మ, శివన్నారాయణ, చైతన్య గరికపాటి, క్రేజి ఖన్నా, బుల్లెట్ భాస్కర్, అంబరీష్ అప్పాజి, కల్పలత, ప్రమోదిని తదితరులు నటించారు. ఓ సాథియా సినిమాకి లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వద్ద పని చేసిన దివ్య భావన దర్శకత్వం వహించగా.. సుభాశ్ కట్టా, చందన కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. విన్నూ వినోద్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ:
వైజాగ్ లో బీటెక్ చదువుతూ ఏమాత్రం జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా సరదాగా గడిపేసే యువకుడి కథ ఈ ‘ఓ సాథియా’ అర్జున్ (ఆర్యన్ గౌరా) ఒకరితో గొడవ పెట్టుకుని ప్రిన్సిపాల్ చేత తిట్లు తింటుండగా కీర్తి (మిస్తీ చక్రవర్తి)ని మొదటి రోజే ప్రేమలో పడతాడు. కొన్ని జిమ్మిక్కులు చేసి ఆమె నా సొంతం అని భావిస్తున్న తరుణంలో అర్జున్ కి కీర్తి హ్యాండ్ ఇచ్చి మాయం అవుతుంది. దీంతో ప్రేమలో ఫెయిల్ అయినట్టు పిచ్చోడిలా మారి కీర్తి కోసం తిరుగుతున్న అర్జున్ కి కీర్తి ఎక్కడుందో తెలుస్తుంది. అక్కడికి వెళ్లిన అర్జున్ ఆమె మరొకరితో ప్రేమలో ఉందని అర్ధం చేసుకుంటాడు. అయితే ముందు అసలు కీర్తి ఎక్కడికి వెళ్లిపోయింది? సడెన్‌గా కీర్తి ఎందుకు మిస్ అయ్యింది? చివరకు అర్జున్ కీర్తి ప్రేమను పొందాడా? అర్జున్ ప్రేమను కీర్తి ఒప్పుకుందా? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
ఈ సినిమాని ఏకంగా యూఎఫ్ఓ డిస్ట్రిబ్యూట్ చేయడంతో సినిమా మీద అంచనాలు పెంచేలా చేసింది. ఉద్యోగం చేస్తున్న అర్జున్ తన మాజీ ప్రియురాలిని చూడడంతో కథ మొదలవుతుంది. అసలు ఆమెను ఎలా కలిశాడు? ఎప్పుడు కలిశాడు? ఎలా ప్రేమలో పడ్డాడు అనే విషయాలను చాలా హృద్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ కథను ఎంత చక్కగా చెప్పాచ్చో తన మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది దర్శకురాలు దివ్యభావన. సున్నితమైన ప్రేమకథను చెప్పాలంటే కథతో పాటు కథనం చాలా ముఖ్యం అందుకే ఈ విషయంలో కూడా దర్శకురాలు తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసి దాదాపు సఫలం అయ్యారు. చిన్న చిన్న లోపాలను పక్కన పెడితే ప్రేమలో ఉన్న అందరూ కనెక్ట్ అయ్యేలా సినిమా చేశారు. ఇక నటీనటుల విషయానికి వస్తే ఆర్యన్ ఎక్కడా కొత్త నటుడు అని అనిపించకుండా చాలా ఈజ్ తో నటించాడు. మిస్టీ చక్రవర్తి కూడా తన పాత్రలో జీవించింది. చైతన్య గరికపాటి కామెడీ బాగా వర్కౌట్ అయింది. దేవీ ప్రసాద్, అన్నపూర్ణమ్మ, శివన్నారాయణ,, క్రేజి ఖన్నా, బుల్లెట్ భాస్కర్, అంబరీష్ అప్పాజి, కల్పలత, ప్రమోదిని వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు. మరోపక్క సినిమాలో పాటలు కూడా ట్రెండీగా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కెమెరామెన్ వేణు పనితనం కొన్ని ఫ్రేమ్స్ లో బాగా కనిపించింది. ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్ సినిమాకి హైలెట్.
ప్లస్ పాయింట్స్
కథ- కథనం
పాటలు
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
స్లో ఫస్టాఫ్
నిడివి
బాటమ్ లైన్:
ప్రతిఒక్కరి ఫస్ట్‌లవ్ గుర్తు చేసే ‘ఓ సాథియా’