రివ్యూ: అమరావతికి ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: శివ కంఠంనేని, ఎస్తేర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, అశోక్ కుమార్, హరీష్, భద్రమ్, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్
- DIRECTOR: Satish Kasetty
- MUSIC: పద్మనాబ్ భరద్వాజ్
- PRODUCER: కెఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వరరావు
తెలుగు ప్రేక్షకులకు హారర్ థ్రిల్లర్ చిత్రాలంటే ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ఆ కోవలో వచ్చిన తాజా చిత్రం అమరావతికి ఆహ్వానం. దెయ్యాల కాన్సెప్ట్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్ డ్రామా, థ్రిల్ అంశాలను మిళితం చేస్తూ దర్శకుడు జీవీకే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్‌లో “అమరావతి” ఉన్నప్పటికీ, ఇది రాజకీయాలకు సంబంధించిన సినిమా కాదని మేకర్స్ ముందుగానే స్పష్టం చేశారు. నిజంగానే ఇది పూర్తిగా హారర్ థ్రిల్లర్ జోనర్‌లోనే సాగుతుంది.
కథ : ఈశ్వర్ (శివ కంఠంనేని) ఒక సస్పెండెడ్ సీఐ. అతని భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). భానుమతి సోదరి భార్గవి (సుప్రిత) యూట్యూబ్‌లో “దెయ్యంతో డే అండ్ నైట్” పేరుతో వీడియోలు చేస్తూ సెలబ్రిటీ అవుతుంది. ఒక అజ్ఞాత వ్యక్తి సూచనతో అసలు దెయ్యం ఉన్నట్టు లైవ్‌లో నిరూపించాలని నిర్ణయించి, కుటుంబంతో కలిసి అమరావతి గ్రామానికి వెళ్తుంది. అక్కడ జరిగే వింత సంఘటనలు, జమీందారు వంశ వారసురాలు రాజేశ్వరి (ఎస్తేర్) మరణం వెనుక ఉన్న రహస్యం, ఈశ్వర్ సస్పెన్షన్‌కు కారణం—ఇవన్నీ కథలో థ్రిల్‌ను పెంచుతాయి.
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
విశ్లేషణ : హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం భయానక అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్, రివెంజ్ డ్రామా కలిపిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దర్శకుడు జీవీకే కథను కమర్షియల్ టచ్‌తో మేళవిస్తూ థ్రిల్‌ను మెయింటైన్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా అమరావతి గ్రామం నేపథ్యంలో సెట్ చేసిన హారర్ సన్నివేశాలు థియేటర్లలో మంచి ప్రభావం చూపిస్తాయి. ప్రీ-ఇంటర్వెల్ మరియు ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్‌లు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. రాజేశ్వరి పాత్రలో ఎస్తేర్ నటన సినిమాకు ప్రధాన బలం కాగా, శివ కంఠంనేని డ్యూయల్ షేడ్స్‌లో మెప్పించారు. జె. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, పద్మనాభ్ భరద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్ మూడ్‌ను బలంగా నిలబెట్టాయి. క్లైమాక్స్‌లో సీక్వెల్ సూచన కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతుంది.
అయితే కొన్ని సన్నివేశాలు ముందే ఊహించదగినట్టుగా ఉండటం కథనం ప్రభావాన్ని కొంత తగ్గిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే పాట కథ వేగానికి చిన్న స్పీడ్ బ్రేక్‌లా అనిపిస్తుంది. అలాగే కొన్ని సపోర్టింగ్ పాత్రలకు మరింత బలం ఇచ్చి ఉంటే సినిమా ఇంకా మెరుగ్గా ఉండేది. మొత్తంగా చూస్తే, మైనస్‌లు ఉన్నప్పటికీ హారర్, థ్రిల్, ఎమోషన్ మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం హారర్ లవర్స్‌ను నిరాశపరచదు.
నటీనటులు : శివ కంఠంనేని డ్యూయల్ రోల్‌లో మెప్పించారు. యాక్షన్, విలన్ షేడ్స్ రెండింటిలోనూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్తేర్ రాజేశ్వరి పాత్రలో సూపర్బ్‌గా నటించారు. ధన్య బాలకృష్ణ, సుప్రిత తమ పాత్రలకు న్యాయం చేశారు. జెమినీ సురేష్, భద్రం, అశోక్ కుమార్ తదితరులు తమ పరిధిలో మెప్పించారు.
ఫైనల్ గా : హారర్, ఫ్యామిలీ ఎమోషన్, రివెంజ్, థ్రిల్ అంశాలతో రూపొందిన అమరావతికి ఆహ్వానం హారర్ ప్రేమికులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో సీక్వెల్ ప్రకటించడం సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తుంది. హారర్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారికి ఇది మంచి వీకెండ్ ఛాయిస్.
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!