Akhil Akkineni Lenin Review : అఖిల్ అక్కినేని లెనిన్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Akhil Akkineni, Bhagya Sri Borse, Shivaji, Brahmaji, Eashwari Rao and Others
- DIRECTOR: Murali Krishna Abburu
- MUSIC: Thaman S
- PRODUCER: Nagarjuna, Naga Vamsi
అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అఖిల్, తన మొదటి సినిమా ‘అఖిల్’ నుంచే సరైన హిట్ కోసం పాకులాడుతున్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పర్వాలేదు అనిపించుకున్న తర్వాత వచ్చిన ‘ఏజెంట్’, అతని కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. కొంత గ్యాప్ తీసుకుని ఆయన ‘లెనిన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మురళీకృష్ణ అపూర్వ డైరెక్షన్లో, నాగార్జున – నాగవంశీ నిర్మాతలుగా రూపొందించిన ఈ సినిమా, ఎట్టకేలకు కొన్ని వాయిదాల అనంతరం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
లెనిన్ కథ:
లెనిన్ (అక్కినేని అఖిల్) ఓ అనాథ. చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామానికి చేరుకున్న అతను, ఓ జాతరలో ఆ ఊరి పెద్ద కుటుంబానికి దగ్గరవుతాడు. ఆ ఊరు మొత్తానికి తలలో నాలుకలా వ్యవహరిస్తూ అందరికీ ఆప్తుడు అవుతాడు. ఈ క్రమంలోనే ఒక జాతర సందర్భంగా అతను భారతి (భాగ్యశ్రీ బోర్సే) తో ప్రేమలో పడతాడు. అయితే, లెనిన్ని పెంచి పెద్ద చేసిన కుటుంబానికి చెందిన వసంత్, భారతిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ, భారతి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను లెనిన్ని ఇష్టపడుతున్నానని చెబుతుంది. దీంతో వసంత్ దగ్గరుండి లెనిన్, భారతి ఇద్దరికీ పెళ్లి చేస్తాడు. అయితే, ఆ తర్వాత ఏం జరిగింది? లెనిన్ ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? ఇందులో భారతి పాత్ర ఏమిటి? ఎతిరాజులు (శివాజీ) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
విశ్లేషణ:
అక్కినేని అఖిల్ నిజానికి చాలా కాలం నుంచి ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన సుదీర్ఘమైన గ్యాప్ తీసుకుని, తన తండ్రి నాగార్జున ఫైనల్ చేసిన ‘లెనిన్’ కథను పట్టాలెక్కించాడు. అయితే, ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచే ఎన్నో లీకులు సినిమాను ఇబ్బంది పెట్టాయి. సినిమా మేకర్స్ కీలకంగా భావించిన చివరి ఎపిసోడ్స్ కొన్ని లీక్ కావడంతో, అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.
సినిమా ప్రారంభమైనప్పటి నుంచే సినిమాలో కీలకమైన ఎపిసోడ్స్‌గా భావించిన కొన్ని సీన్లు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలానే ఉన్నాయి. ముఖ్యంగా అనాథగా ఓ కుర్రాడు ఓ గ్రామానికి రావడం, అక్కడ వారందరితో కలిసిపోవడం బాగుంది. అయితే కొద్దిసేపటికి, పెరిగి పెద్దవాడైన అతను జైలు నుంచి బయటకు రావడం, ఆ తర్వాత అతని క్రేజ్ చూస్తూ జైలర్ అండ్ టీమ్ వెనుక పడటం లాంటి ఎలివేషన్స్ కొంత వర్కౌట్ అయ్యాయి.
ఇక ఆ తర్వాత కథ ఎందుకో రొటీన్ ఫార్మాట్లో సాగుతున్న ఫీలింగ్ కలిగించినా, కథను ఊహించలేకుండా ముందుకు నడిపించడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొత్త కథ అని చెప్పలేం. ఎప్పటినుంచో మనం చూస్తున్న తెలుగు సినిమాల్లోని కథలానే అనిపిస్తుంది. కానీ, రాసుకున్న కొన్ని ట్విస్టులు మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా రాసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కాకపోతే, రొటీన్ ఫీలింగ్ కలగడం కొంత ఇబ్బందికర అంశం.
ఇక సెకండ్ హాఫ్ అంతా కాసేపటికి ఒకసారి వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. దారుణం ఏమిటంటే, సోషల్ మీడియాలో చాలావరకు ప్రచారం జరిగిన ట్విస్టులు యథాతథంగా సినిమాలో ఉండటమే. ఇక ఈ ట్విస్టులను బయటకు రాకుండా చేసుకోవడంలో సినిమా టీమ్స్ ఎందుకు విఫలమవుతున్నాయో అర్థం కావడం లేదు. మొన్న ‘పెద్ది’, ఇప్పుడు ‘లెనిన్’.. ఈ రెండు సినిమాలలో షాక్ ఫ్యాక్టర్స్ అని మేకర్స్ భావించినవి ఎప్పుడో సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడం సినిమాలకు కాస్త ఇబ్బందికర అంశంగానే పరిగణించొచ్చు. ఓవరాల్‌గా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కన్నా, మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే, అఖిల్ అక్కినేని లెనిన్ పాత్రలో పూర్తిగా లీనమైపోయి నటించాడు. అయితే, అతని మేకోవర్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. భాగ్యశ్రీ బోర్సేకి మంచి పాత్ర పడింది. కేవలం అందమే కాదు, అభినయంతోనూ ఆమె ఆకట్టుకునే ఛాన్స్ దొరికింది. ఇక వసంత్ పాత్రధారి కొత్తగా కనిపించినా, తెలుగు స్క్రీన్ మీద మంచి స్కోప్ ఉన్న నటుడిలానే కనిపించాడు. బ్రహ్మాజీ, శత్రు, శివాజీ, ఈశ్వరి రావు వంటి వాళ్లు తమ అనుభవంతో స్క్రీన్ మీద చాలా న్యాచురల్‌గా నటించారు.
ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం విషయానికి వస్తే సినిమాకి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కాకపోతే పాటలు ఎందుకో పంటి కింద రాయిలా అనిపిస్తాయి. నిడివి విషయంలో కూడా ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ వరకు అసలు ఏం జరగబోతోందా అనే అంచనాలు పెంచుతూ వెళ్లి, సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ, ఎంగేజ్ చేసే ట్విస్టులు కొంతవరకు సినిమాను సేవ్ అయ్యేలా చేశాయి.
ఫైనల్లీ: లెనిన్.. మాస్ ఎంటర్టైనర్ విత్ ఎంగేజింగ్ ట్విస్ట్స్
తాజావార్తలు
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!