A Beautiful Breakup Review: ఇళయరాజా సంగీతం అందించిన ‘వాలంటైన్స్ డే’ రివ్యూ!
- 'వాలంటైన్స్ డే' వీక్‌లో రిలీజ్ అయిన ఏ బ్యూటిఫుల్ బ్రేకప్
- తెలుగు వారు నిర్మించిన సినిమా ఏ బ్యూటిఫుల్ బ్రేకప్
- సంగీతం అందించిన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Thaksh, Matylda Bajer
- DIRECTOR: Ajithvasan Uggina
- MUSIC: Ilaiyaraaja
- PRODUCER: Mudragada Rangarao, Uggina Satyanarayana Rao
‘వాలంటైన్స్ డే’ వీక్‌లో రిలీజ్ అయిన లవ్ అండ్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘ఏ బ్యూటిఫుల్ బ్రేకప్’. ఆంగ్ల భాషలో తెరకెక్కిన ఈ చిత్రంను మన తెలుగు వారు ముద్రగడ రంగారావు, ఉగ్గిన సత్యనారాయణ నిర్మించారు. అజిత్ వాసన్ ఉగ్గిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తక్ష్ ముద్రగడ, మటిల్డా బజర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. దాంతో అందరిలో ఆసక్తి నెలకొంది. తెలుగు వారు నిర్మించిన, ఇళయరాజా సంగీతం అందించిన ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
అనివార్య కారణాలతో విడిపోవడానికి సిద్ధమైన ఒక యువ జంట.. తమ పెళ్లి బంధాన్ని గౌరవంగా ముగించాలని అనుకుంటారు. అందుకు ఇద్దరు కలిసి విహారయాత్రకు వెళ్తారు. యువ జంట ఒక నిర్మానుష్య ప్రాంతంలోని ఎస్టేట్‌లో స్టే చేస్తారు. ఎస్టేట్‌లో ఇద్దరి మధ్య కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. సాధారణ హారర్ సినిమాల మాదిరి కాకుండా.. ఒక పవిత్రమైన ఆత్మ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇంతకీ పవిత్రమైన ఆత్మ ఏంటి?, ఇద్దరు సంతోషంగా విడిపోయారా? లేదా మళ్లీ కలిశారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Also Read
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Divija Prabhakar: ఎంతో కష్టపడి సినిమా చేశాం.. 'వెంకట్రామయ్య గారి తాలూకా' అందరికీ నచ్చుతుంది!
నటీనటుల పెర్ఫామెన్స్:
నటీనటులు తక్ష్, మటిల్డా బజర్ కొత్త వారు. అయినా ఇద్దరు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇద్దరి మధ్య కొన్ని సన్నివేశాల్లో కెమిస్ట్రీ, ఎమోషన్స్ బాగా పండాయి. ఎస్టేట్‌లోకి వెళ్ళాక సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. తక్ష్, మటిల్డా కొన్ని సీన్లలో బాగా నటించారు. హీరోయిన్ అందంగా కనిపించారు. హారర్ చిత్రాల్లో కొత్తదనం కోరుకునే వారికి, అలానే ఇళయరాజా సంగీత అభిమానులకు ఈ సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది.
విశ్లేషణ:
ఈ సినిమాకు అతిపెద్ద బలం మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం. లండన్‌లోని ప్రసిద్ధ ‘బో టై ఆర్కెస్ట్రా’తో కలిసి ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి సన్నివేశంలో భావోద్వేగాలను పండించడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. దర్శకుడు అజిత్ వాసన్ వెరైటీ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారనే చెప్పాలి. చిక్కమగళూరు అడవుల్లో తీసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కలర్ గ్రేడింగ్, సౌండ్ డిజైన్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. సినిమాలో లవ్, ఎమోషన్స్ వర్కౌట్ అయింది. స్లో నెరేషన్ సినిమాకు మైనస్ అనే చెప్పాలి.
ఫైనల్లీ:
డిఫరెంట్ హారర్ కాన్సెప్ట్.
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్‌పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!