Site icon NTV Telugu

Value Gold : ఆంధ్రప్రదేశ్ లో అత్యంత విశ్వసనీయ బంగారం కొనుగోలు సంస్థ వాల్యూ గోల్డ్ బ్రాంచ్ ల విస్తరణ

Value Gold 1

Value Gold 1

విశ్వసనీయ బంగారు ఆభరణాల కొనుగోలు సంస్థ క్యాప్స్ గోల్డ్ యొక్క విభాగం అయిన వాల్యూ గోల్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఏడు కొత్త బ్రాంచ్ లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. విశాఖపట్టణంలోని గాజువాక, జగదాంబ, గోపాలపట్నం, మధురవాడ ప్రాంతాల్లో, విజయవాడలోని ఎంజీ రోడ్డు, భవానీపురంలో, కర్నూల్ లోని ఇందిరా నగర్ లో విస్తరించనున్నట్లు పేర్కొంది. క్యాప్స్ గోల్డ్ నుంచి వారసత్వంగా పొందిన సమగ్రత, పారదర్శకతను అనుసరిస్తూ వాల్యూ గోల్డ్.. బంగారానికి తక్షణ నగదు, తాకట్టు బంగారం విడుదల మరియు ఖచ్చితమైన, సాంకేతిక ఆధారిత మూల్యాంకనాలతో వినియోగదారులకు మంచి వెసులుబాటు కల్పించనుంది. ఈ ప్రారంభం భారతదేశం అంతటా తమ నమ్మకమైన ఆర్థిక సహాయం మరియు కస్టమర్-ఫస్ట్ సేవలను విస్తరించాలనే కంపెనీ దీర్ఘదృష్టికి ఒక ముఖ్యమైన మైలురాయిని నిలుస్తుంది.

1901 నుంచి భారతదేశంలో అత్యంత పేరు పొందిన బంగారం కొనుగోలు సంస్థ అయిన క్యాప్స్ గోల్డ్ యొక్క విభాగమైన వాల్యూ గోల్డ్.. పారదర్శకత, ఖచ్చితత్వం మరియు ఆటోమేటెడ్ ప్రక్రియతో బంగారం కొనుగోలుకు సరికొత్త ఒరవడి చుట్టింది. వాల్యూగోల్డ్.. బంగారం కొనుగోలు, తాకట్టు బంగారం విడుదలలో నైపుణ్యం కలిగి ఉండడంతో పాటు తక్షణ, వేగవంతమైన నగదు చెల్లింపుపై దృష్టి సారిస్తుంది.

వాల్యూ గోల్డ్ డైరెక్టర్ అభిషేక్ చందా మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌లో వాల్యూ గోల్డ్ యొక్క విశ్వసనీయ సేవలను ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. గత రెండు సంవత్సరాలలో, మేము తెలంగాణలో 10,000 మందికి పైగా వినియోగదారులకు సేవలు అందించాము. ఈ విస్తరణ మా అభివృద్ధికి మరో అడుగు కానుంది. బంగారం కొనుగోలు వంటి ఆర్థిక నిర్ణయాల్లో నమ్మకమైన, పారదర్శక అనుభవాన్ని వినియోగదారులకు అందించేందుకు మేం ఎల్లప్పుడూ కృషి చేస్తాం.” అని అన్నారు.

గత రెండు సంవత్సరాలలో, వాల్యూ గోల్డ్ గణనీయమైన వృద్ధిని సాధించింది. నాలుగు బ్రాంచ్ లుగా మొదలై గత ఆరు నెలల్లోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 15 కొత్త బ్రాంచ్ లను ప్రారంభించింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 19 బ్రాంచ్ లను కలిగి ఉంది. రాబోయే రెండు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 40 నుంచి 50 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించి దక్షిణ భారతదేశం అంతటా తన విశ్వసనీయ సేవలను మరింత విస్తరించడంపై దృష్టి సారిస్తోంది.

వాల్యూ గోల్డ్ డైరెక్టర్ అఖిల్ చందా మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌లోకి విస్తరించడం.. మా బంగారం విక్రయాన్ని మరింత అందుబాటులోకి తెచ్చి, విశ్వసనీయంగా చేయాలనే లక్ష్యాన్ని బలపరుస్తుంది. వాల్యూ గోల్డ్‌లో వినియోగదారుడితో చెప్పే ప్రతీ మాట.. పారదర్శకత, గౌరవం, మరియు విలువతో కూడి ఉంటుంది.” అని అన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి మరియు వాల్యూ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్ అనసూయ భరద్వాజ్ హాజరయ్యారు. నమ్మకం, సాధికారత, మరియు ప్రామాణికతను సూచించే బ్రాండ్ గా వాల్యూ గోల్డ్ ను సమర్థించారు.

ఈ కార్యక్రమానికి వాల్యూ గోల్డ్ సీఈఓ భరద్వాజ్ పంపట్వార్ సహా డైరెక్టర్లు హాజరయ్యారు.

Exit mobile version