Site icon NTV Telugu

Film Chamber: మిడిమిడి జ్ఞానంతో అర్ధం పర్ధం లేని రాతలు రాయద్దు.. ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన!

Film Chamber Press Meet

Film Chamber Press Meet

Telugu Film Chamber of Commerce on Sankranthi Release Movies: రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల విడుదల వివాదాలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి మరియు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మరోసారి వివరణ ఇస్తూ ఒక నోట్ రిలీజ్ చేశాయి. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల థియేటర్ల వివాదాల పైన తెలుగు చిత్రాలకి సంబంధించి తమ మూడు సంస్థలు 15 రోజుల క్రితం ఒక మీటింగ్ పెట్టి సంక్రాంతి బరిలో ఉన్న ఐదుగురు ప్రొడ్యూసర్లు పిలిచి గ్రౌండ్ రియాలిటీ వివరించి సహకరించమని కోరడం జరిగిందని పేర్కొన్నారు. సంక్రాంతి బరిలో ప్రతి ఏటా సినిమాల పోటీ ఉంటుంది, అదే విధంగా ఈ ఏడాది కూడా ఐదు సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. హనుమాన్, ఈగల్, సైంధవ్, గుంటూరు కారం సహా నా సామి రంగ సినిమాలు బరిలో ఉండగా ఛాంబర్ వినతిని మన్నించి సంక్రాంతి బరి నుంచి ఈగల్ సినిమా నిర్మాతలు టీ. విశ్వ ప్రసాద్, వివేక్, హీరో రవి తేజ సహకరించి ఫిబ్రవరి 9కి మార్చుకున్నారు. ఒక మాస్ హీరో డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ వెనక్కి తగ్గడం అనేది ఆషామాషీ విషయం కాదు. ఈ రోజుల్లో వ్యాపార పరంగా కూడా అంత సులువైన విషయం కాదు. అలా ఒక మాస్ హీరో ఇండస్ట్రీ బాగు కోసం ముందుకు వచ్చి సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవడం తద్వారా మిగతా మిగతా నలుగురికి సహకరించడం ఇండస్ట్రీకి ఆహ్వానించదగ్గ శుభపరిణామం అని పేర్కొన్నారు. అదేవిధంగా సంక్రాంతి బరిలో హీరో రజనీకాంత్, ధనుష్ సహకరించి వాయిదా వేయడం జరిగింది. శివ కార్తికేయన్ తమిళ సినిమా కూడా రిలీజ్ కి ఉండగా ఆ ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి సినిమాని 19 కి వాయిదా వేయించడం జరిగింది.

Ashika Ranganath: జూనియర్ అనుష్క అనిపించుకోవడం హ్యాపీనే.. నా సామిరంగ భామ ఆషిక రంగనాధ్ ఇంటర్వ్యూ

సంక్రాంతి అంటే ఒక మంచి పోటీ సినిమాల మధ్య హెల్తీ వాతావరణం ఉంటుంది, తెలుగు సినిమాకి సంబంధించి మా మూడు సంస్థలు కలిపి ఏ హీరోకి ప్రొడ్యూసర్ కి దర్శకుడు కి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుండి నడిపిస్తున్నాం కానీ కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్ అలాగే ఇతర మీడియాలో కావాలనే సంక్రాంతి టైంలో వాళ్ల రేటింగ్లు, టిఆర్పిల కోసం ఇష్టమైన రాతలు, ఆర్టికల్స్ రాస్తూ సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ మధ్య హీరోల మధ్య ప్రొడ్యూసర్ల మధ్య దర్శకుల మధ్య ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అలా ఇబ్బందికర వ్యాఖ్యలు చేసే వెబ్సైట్స్, సోషల్ మీడియా, మరి ఏ మీడియా అయినను ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సోషల్ మీడియా, వెబ్సైట్స్ మరియు ఇతర మీడియా ఏదైనా ఆర్టికల్స్ రాసే ముందు మా మూడు ఆర్గనైజేషన్స్ ని సంప్రదించి నిజాన్ని తెలుసుకుని వార్తలు ప్రచురించాలని పేర్కొన్నారు. మీరు చెప్పాలనుకున్న వార్తలని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు కానీ పరిశ్రమలో అబద్ధపు వార్తలు ఇబ్బంది పెట్టే వార్తలు రాస్తూ ఎదుటి వారి మనోభావాలను వ్యక్తిగతంగా ఈర్ష్య ద్వేషాలతో వారి ప్రతిష్టను దెబ్బతీయడం సరైనది కాదు. ఎవరైనా ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, దర్శకులు కానీ మాట్లాడినప్పుడు ఆ మాటలు పూర్తిగా వినకుండా తాత్పర్యాన్ని అర్థం చేసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో పరిశ్రమని ఇబ్బంది పడే విధంగా ఆర్టికల్స్ రాయడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు ఇకనుంచి సోషల్ మీడియా, ఇతర మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టే రాతలు రాస్తే మటుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. పరిశ్రమలో అనారోగ్యకరమైన, ఇబ్బందికర వాతావరణం కలగకూడదు, విడుదలయ్యే ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలి పరిశ్రమ బాగుండాలి అనేది మా మూడు సంస్థల ప్రయత్నం అని అన్నారు. పరిశ్రమ పుట్టినప్పటి నుండి తెలుగు సినీ పరిశ్రమకు మీడియాతో అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకమీదట ఇలాంటి ఇబ్బందికర వ్యాఖ్యలు చేసే వారిపై తెలుగు జర్నలిస్ట్ సంఘాలు- మీడియా యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా యావత్ తెలుగు సినీ పరిశ్రమ తరపున కోరడమైనదని లేఖలో పేర్కొన్నారు.

Exit mobile version