38 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెల్లరి ఇప్పుడు తన 46వ షోరూంను చిత్తూరులో ప్రారంభిస్తోంది. తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉంది. తద్వార ప్రజలు పెద్దమొత్తంలో తమ కష్టార్జితాన్ని ఆదా చేయొచ్చు! అంతేకాదు ప్రారంభోత్సవం సందర్భంగా మార్కెట్లోనే ఇతర షోరూంలలో లభించని సరికొత్త ‘బంగారు నగల కొనుగోలు పథకం’ను కూడా అందిస్తోంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విశేష ఆధరణను పొందింది లలితా జ్యువెల్లరి. ఇప్పుడు చిత్తూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఇక్కడ కొత్త షోరూం ప్రారంభం కానుంది. అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు, తక్కువ ధరలో నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో, వినియోగదారుల ఆశీస్సులతో ఈ షోరూంలను ఆరంభిస్తుండటం మరింత విశేషం.
“వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, భీమవరం, కాకినాడ, గుంటూరు, శ్రీకాకుళం, గోపాలపట్నం, గాజువాక, విజయనగరం, అనంతపురం, ఒంగోలు, నరసారావుపేట, నిజామాబాద్, హైదరాబాద్ లోని కూకట్పల్లి, సోమాజిగూడ, దిల్ షుఖ్ నగర్, చందానగర్ షోరూంలకు ప్రజల నుంచి దక్కిన విశేష ఆదరణను చూసి.. దక్షిణభారతదేశం వ్యాప్తంగా మా సేవలు విస్తృతం చేయాలనుకుంటున్నాం. చిత్తూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ స్థాయిలో ప్రజలు మా ఇతర షోరూంలకు వచ్చి నగలు కొన్నారు. అందువల్లే మేం ఇక్కడ కొత్త షోరూంను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం’ అని చెబుతున్నారు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.ఎం.కిరణ్ కుమార్, చిత్తూరులోని నెం.15-359, చామంతిపురం, వేలూరు రోడ్ అనే చిరునామాలో ఫిబ్రవరి 1న ఉదయం 9.30 గంటలకు అతిథుల సమక్షంలో ప్రారంభోత్సవం వైభవంగా జరుగనుంది.