Site icon NTV Telugu

Telangana : రాష్ట్ర పెరిక కుల సంఘ అధ్యక్షుడిగా గటిక విజయ్‌కుమార్

Vijay

Vijay

Telangana : తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘ అధ్యక్షుడిగా గటిక విజయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా అధ్యక్షులు, ప్రతినిధులు ఏకగ్రీవ నిర్ణయంతో ఆయనను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెరిక కుల నాయకులు, సభ్యులు భారీగా హాజరయ్యారు. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గటిక విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. “పెరిక కుల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తాం. రాష్ట్రంలో ప్రతి జిల్లా స్థాయిలో కుల ఐక్యతను బలపరుస్తాం. యువతకు ఉపాధి అవకాశాలు, విద్యా ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం,” అని పేర్కొన్నారు. ఇక కోకాపేటలో నిర్మాణంలో ఉన్న పెరిక కుల భవన నిర్మాణ కమిటీ ఛైర్మన్‌గా సుందరి వీర భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు మద్ధ లింగయ్యతో పాటు పలువురు నాయకులు, సభ్యులు కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు, కమిటీకి అభినందనలు తెలిపారు.

Exit mobile version