NTV Telugu Site icon

Ectopic Pregnancy : ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి… ఎందుకు వస్తుంది ?

Bhargavi Reddy Bithright

Bhargavi Reddy Bithright

గర్భధారణ అనే ప్రక్రియ.. అండంతో శుక్రకణం కలి శాక, అది పిండంగా ఏర్పడ్డ సమయం నుంచి మొదల వుతుంది. అండంతో శుక్రకణం కలవడాన్ని ‘ఫలదీక రణ’ అంటారు, ఫలదీకరణ జరిగాక ఏర్పడ్డ పిండం గర్భసంచిలో పెరగాలి. కానీ, కొన్ని సందర్భాల్లో గర్భ సంచిలో కాకుండా.. దాని పరిసరాల్లో పిండం పెరగడాన్ని ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’ అంటారు.

అండాశయం (ఓవరీస్) నుంచి అండాన్ని గర్భసంచి లోకి వచ్చేలా తోడ్పడే ట్యూబ్ను ‘ఫెలోపియన్ ట్యూబ్స్’ అంటారు. కొన్ని సందర్భాల్లో పిండు గర్భ సంచిలో బదులు ఈ ఫెలోపియన్ ట్యూబుల్లో పెరగడం తోపాటు ఒక్కోసారి అండాశయాల్లో (ఓవరీస్), కాస్తంత కిందికి వస్తే గర్భాశయ ముఖద్వారంలో, ఒక్కోసారి కడుపులో కూడా పెరుగవచ్చు. ఈ సమస్యనే ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా వ్యవహరిస్తారు.

ఇలాంటి సందర్భాల్లో సాధారణ గర్భధారణలా పిండం ఏర్పడటం, ఆ తర్వాత అని శిలువుగా రూపొందే ప్రక్రియ జరగదు. ఫలితంగా ఆ పిండంలో మనుగడ కొరవడుతుంది. అంతేకాదు.. ఒక్కోసారి అరుదుగా తల్లిలో రక్తస్రావానికి కారణమై ఆమెకు కూడా ముప్పు తెచ్చిపెడుతుంది.

లక్షణాలు :

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే కొంతమందిలో గర్బధారణలో కనిపించినట్టే కనిపించినట్టే పీరియడ్స్ ఆగిపోవడం, వికారం, వాంతులు కనిపిస్తాయి. అంతేకాదు.. మామూలుగా తమకు తాముగా చేసుకునే ప్రెగ్నెన్సీ పరీ క్షల్లోనూ ఫలితాలు ‘పాజిటివ్’ అని వస్తాయి. అయితే, మామూలుగా పిండం ఎదుగుదల గర్భసంచిలో మాత్రమే ఉంటుంది, కానీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో పిండం ఎక్కడో గర్భసంచి బయట ఏర్పడుతుంది. కాబట్టి, పిండం ఎదుగుదల నార్మల్ గా ఉండదు.

ఎప్పుడు అనుమానించాలి? డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి అంటే ?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా అనుమానించడానికి తోడ్పడే కొన్ని లక్షణాలు ఇలా వ్యక్తమవుతాయి.
తొలిదశల్లో యోని నుంచి రక్తస్రావం కావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం ద్వారా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా అనుమానించాలి.
తల తేలికైపోయిన ఫీలింగ్తో పాటు స్పృహ తప్పవచ్చు.
భుజం నొప్పి కూడా కనిపించవచ్చు.
ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణం డాక్టర్ను కలవాలి.

ఎవరెవరిలో ముప్పు ఉంటుందంటే?

ఆ మొదట ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉన్నవాళ్ల మరోసారి కూడా వచ్చే అవకాశముంది.
ఆ జీవిత భాగస్వామి నుంచి గనేరియా, క్లమీడియా వంటి కొన్ని లైంగిక సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకిన మహిళల్లో ఈ ముప్పు కనిపించవచ్చు.
ఆ సంతాన సాఫల్యత కోసం చికిత్సలు తీసుకుంటున్న వారిలో.
ఫెలోపియన్ ట్యూబుల్లో లోపాలుండి, వాటిని సరిదిద్దేందుకు శస్త్రచికిత్స తీసుకున్నవారిలో
పొగతాగే అలవాటు ఉన్న మహిళల్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి అవకాశాలు ఎక్కువ.

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్లు :

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చాలావరకు ఫెలోపియన్ ట్యూబుల్లో పెరుగుతుంది. ఆ పెరుగుదలకు తగినట్లుగా సాగలేక ట్యూబులు గాయపడవచ్చు. ఫలితంగా గాయపడ్డ ట్యూబుల్లో తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ఇలా ఆగకుండా అయ్యే రక్తస్రావంతో ఒక్కోసారి తల్లి ప్రాణానికే ముప్పు రావచ్చు.

నివారణ :

* పొగతాగే అలవాటుకు పూర్తిగా దూరంగా ఉండటం. ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నివారణకే కాదు.. అనేక ఇతర అనారోగ్యాలనూ నివారిస్తుంది.
* ముందస్తుగా చేసే నిర్ధారణ మరియు చికిత్స ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ లో చాలా ముఖ్యం

Dr K. Bhargavi Reddy
Obstetrics and Gynecologist
BirthRight By Rainbow Hospitals
Banjara Hills, Hyderabad
Contact : 888046046