Site icon NTV Telugu

Dr. AMR Autism Centre: జీరో మెడికేషన్ సిస్టంపై తల్లిదండ్రులకు ఆటిజం స్పెషలిస్ట్ కీలక సందేశం!

Amr

Amr

Dr. AMR Autism Centre: డాక్టర్ కర్ర హోమియోపతి అధినేత అండ్ ఇంటర్నేషనల్ ఆటిజం స్పెషలిస్ట్ Dr. AMR హైదరాబాద్‌లోని పాత బస్తీలలో ఉన్న గ్రేసియస్ స్కూల్‌లో జరిగిన బాలల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో బాలల ఆరోగ్యంపై ఆయన సారాంశం, ప్రభావం కలిగిన ప్రసంగాన్ని అందించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆటిజం (Autism), ADHD, అతి చురుకుదనం (Hyperactive), ప్రవర్తనా సమస్యలు (Behavioural Challenges), విద్యార్థులలో అకాడమిక్ ఇబ్బందుల వంటి పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోవడంపై ప్రధానంగా చర్చ జరిగింది. పిల్లల శారీరక, మానసిక శ్రేయస్సును కాపాడటానికి తల్లిదండ్రులు అండ్ పాఠశాల ఉపాధ్యాయులు కలిసి పని చేయాల్సిన ఆవశ్యకతను డాక్టర్ ఏఎంఆర్ రెడ్డి నొక్కి చెప్పారు.

Read Also: Tej Pratap Yadav: లాలూ, రబ్రీలను వేధిస్తున్నారు.. దర్యాప్తుకు కుమారుడి డిమాండ్..

ఈ సందర్భంగా డాక్టర్ ఏఎంఆర్ రెడ్డి జీరో మెడికేషన్ సిస్టమ్స్ (ZMS) గురించి మాట్లాడుతూ.. ఇది 12 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు అనవసరమైన మందులు లేకుండా సహజంగా ఎదగడానికి ప్రోత్సహించే ఒక ఆరోగ్య విధానం అన్నారు. పిల్లలు వారి బాల్యంలో సహజమైన, మందులు లేని జీవితాన్ని గడపడానికి మనం సహాయం చేయగలిగితే, వారి ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి మరియు భవిష్యత్తు సామర్థ్యాన్ని మనం గొప్పగా బలోపేతం చేయగలం అన్నారు. అధికంగా మందులు వాడటంతో పాటు అనవసరమైన టీకాలు కొన్నిసార్లు పిల్లల ఎదుగుదల, ప్రవర్తన, ఏకాగ్రతకు భంగం కలిగిస్తాయన్నారు. కాబట్టి ZMS దీర్ఘకాలిక ఆరోగ్యానికి తోడ్పడే సహజమైన జీవనశైలి విధానాలను అవలంబించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రస్తుతం ఉన్న ఆధునిక జీవనశైలి పిల్లలలో పెరిగిన అతి చురుకుదనంతో పాటు ప్రవర్తనా సమస్యలకు ఎలా దారితీస్తుందో డాక్టర్ రెడ్డి వివరించారు. ఆటిజం, ADHD, గట్ అసమతుల్యత, నేర్చుకునే ఇబ్బందులు వంటి పరిస్థితులను ముందుగానే పరిష్కరించకపోతే పిల్లలు పెరిగే కొద్దీ అవి మరింత తీవ్రమవుతాయని అన్నారు. నేటి తరం చాలా చిన్న వయసులోనే ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటుందని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం ఇప్పుడు బాధ్యత తీసుకోకపోతే మన పిల్లలకు భవిష్యత్తు మరింత కష్టంగా మారుతుందని వారు హెచ్చరించారు.

Read Also: Kayadu Lohar : ఆ వార్తలు చూసి ఏడ్చేశా.. కయాదు లోహర్ కామెంట్స్

ఇక, సేఫ్ ప్రెగ్నెన్సీ (Safe Pregnancy) కొరకు హోమియోపతిలో చాలా అద్భుతమైన మందులు ఉన్నాయని, వ్యాధి వచ్చిన తర్వాత బాధపడటం కంటే ఎటువంటి జబ్బులు రాకుండా జాగ్రత్తపడటం చాలా ముఖ్యమని డాక్టర్ ఏఎంఆర్ రెడ్డి తెలిపారు. ఈ విలువైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పాఠశాల యాజమాన్యానికి, ఈ బాలల దినోత్సవం వేడుకలలో తాను కూడా భాగం అయినందుకు, ఈ కార్యక్రమం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు చురుకైన భాగస్వామ్యంతో చాలా సంతోషంగా ఉందని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు అని డాక్టర్ AMR తెలిపారు.

Exit mobile version