Exxeella Group: తెలుగు రాష్ట్రాలలోని మహిళలందరికీ “అంతర్జాతీయ మహిళా దినోత్సవ” శుభాకాంక్షలు తెలియజేస్తూ “అన్ని రంగాలలో మహిళలకు ఎప్పుడైతే ప్రాధాన్యత ఉంటుందో అప్పుడే దేశం ముందుకు సాగుతుంది” అని ఎక్సల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ వ్యవస్థాపకుడు/చైర్మన్ అరసవిల్లి అరవింద్ గారు వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత అంటే సంక్షోభ సమయంలో అనేక విధాలుగా మహిళల్లో అంతులేని శక్తిని మరియు ధైర్యాన్ని పెంపొందింపచేయడమే అని, ఎక్సల్ల ఎడ్యుకేషన్ గ్రూప్‌లో మహిళలు స్వేచ్ఛను ఆస్వాదిస్తారని మరియు తమ నిర్ణయాలను స్వేచ్చగా వెల్లడిస్తారని, ఎందుకంటే వారి జీవితానికి మరియు భవిష్యత్తుకు వారే సరైన నిర్ణయ కర్తలు అని మేనేజ్‌మెంట్ విశ్వసిస్తుందన్నారు.
మహిళా సాధికారత గురించి తన అభిప్రాయాలు మరియు భావజాలాన్ని వ్యక్తపరుస్తూ, “మహిళలకు సాధికారత కల్పించడం అనేది మహిళలను సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల మరియు లింగ ఆధారిత వివక్షల నుండి విముక్తులను చేయడమే అని పురుషుల మాదిరిగానే స్త్రీలు సమాన హక్కులు మరియు అవకాశాలను అందిపుచ్చుకోవాలని అరసవిల్లి అరవింద్ గారు పిలుపునిచ్చారు. Exxella Group of Companies లో ‘మహిళల సాధికారత’ అనే స్పష్టమైన ఉద్దేశ్యాన్ని మరియు మేనేజ్మెంట్ మహిళల గౌరవానికి ఇచ్చే ప్రాధాన్యతని చూడవచ్చని, ఎక్సల్ల సిబ్బందిలో ఎక్కువ మంది మహిళలు ఉండటం మరియు మహిళలే కీలక స్థానాల్లో ఉండటం చూస్తే Exxeella మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుసుకోవచ్చన్నారు.
R.సౌజన్య(ఎక్సీల్లా ఎడ్యుకేషన్ గ్రూప్స్ యొక్క CEO): అత్యున్నత స్థాయి కార్యనిర్వాహకురలిగా సంస్థ యొక్క మొత్తం కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు మరియు కార్పొరేట్ నిర్ణయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. K వినీత (Human Resource Manager): విజయవాడ, హైదరాబాద్, గుంటూరు మరియు వైజాగ్ శాఖలలో చురుకుగా ఉద్యోగులను రిక్రూట్ చేయడం, స్క్రీనింగ్ చేయడం, ఇంటర్వ్యూ చేయడంతో పాటు మేనేజ్మెంట్ మరియు ఉద్యోగులకు మధ్య వారధిగా సమర్థవంతంగా విధులను నిర్వహిస్తున్నారు. M లావణ్య (అడ్మిషన్ హెడ్) : దాదాపు 20 మంది ఉద్యోగులను లీడ్ చేస్తూ అన్ని శాఖల నుండి వచ్చే అప్లికేషన్స్ ను ప్రాసెస్ చేయడం లో సమర్ధవంతంగా విధులను నిర్వహిస్తున్నారు
ఇంకా వైజాగ్ లో మేఘమాల, హైదరాబాద్ లో సయ్యద్ ఫౌజియా , గుంటూరులో ప్రవల్లిక, మరియు విజయవాడ లో ప్రియాంక వీరంతా బ్రాంచ్ మేనేజర్లు గా అంతర్జాతీయ విద్యను కోరుకునే విద్యార్థులకు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని “తమ ఏకైక ఉద్దేశ్యం స్త్రీ మనోబలాన్ని, శక్తి ని పెంపొందింపజేయడమే అని, ఇందులో భాగంగానే “అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్” స్థాపించి ఎంతో మంది పేద విద్యార్థులకు సహకారం అందిస్తూ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అందించడం జరుగుతుంది. ఇటీవల కలం లో ఆంధ్ర ప్రదేశ్ మొదటి లేడీ బాడీ బిల్డర్ అయిన ఎస్తేరు రాణి గారికి సహాయం అందిచచడంతో పాటుగా భవిష్యత్ లో జరిగే పోటీలకు కూడా తమ వంతు సహకారం అందిస్తామని తెలియజేసారు.