Non-Surgical Treatment For Arthritis: అవును.. మీరు చదివింది నిజమే! ఇంతవరకు మోకాలి లేదా భుజం నొప్పులకు భారీగా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేసి, లోపల ప్లాస్టిక్ తొడుగులు వేసి రోజుల తరబడి మంచానికి పరిమితం చేసే ప్రక్రియకు ప్రత్యామ్యాయం వెలుగు చూసింది. జపాన్, అమెరికాలలో ఉన్నత వైద్యశ్రేణి ఆమోదం పొందిన జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ( జిఎఈ) అనే నూతన విధానం రోజురోజుకీ విజయశాతాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ విధానం ప్రస్తుతం హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా విశిష్ట వైద్య సేవలందిస్తున్న ఎవిస్ హాస్పిటల్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త చికిత్సా విధానం ఫ్లూరోస్కోపీ మార్గదర్శకత్వంలో తొడ భాగంలోని ఒక సిరలో సూక్షమైన క్యాథటర్ ప్రవేశపెడతారు. తర్వాత దానిని కీళ్లనరాల వైపు నడిపిస్తారు. ఆసమయంలో మోకాలు కీలుకి రక్తప్రవాహాన్ని నిరోధించేందుకు చిన్న చిన్న రేణువులను ప్రవేశపెడతారు. స్పర్శ తెలిపే నరాలను అతిగా ప్రేరేపించే హైపర్ వ్యాస్క్యులారిటీ అనే పరిస్ధితిని ఈ ప్రక్రియ తగ్గిస్తుంది. దీంతో పేషెంట్ మోకాలి నొప్పి దాదాపు 90 శాతం తగ్గిపోతుంది. కేవలం 15 నిముషాల వ్యవధిలో జరిగే ఈ చికిత్స తర్వాత కేవలం గంట నుంచి మూడు గంటల విశ్రాంతి అనంతరం 2రోజుల్లోనే యధావిధిగా అన్ని పనులు చేసుకోవచ్చు!
జిఎఈతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్ రాజా వెల్లడించారు.. జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ( జిఎఈ) విధానంపై విదేశాలలో ప్రత్యేక శిక్షణ పొందిన ఎవిస్ హాస్పిటల్స్ ఎండీ, ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియోలజిస్ట్ డాక్టర్ రాజా.వి.కొప్పాల పలు వివరాలు తెలిపారు. స్వభావరీత్యా ఇది తక్కువ కోతతో కూడుకున్నదని, కేవలం పగటిపూట ఈ మొత్తం కార్యక్రమం పూర్తయి, ఇంటికి వెళ్లిపోవచ్చునన్నారు. దీనివలన ఎటువంటి క్లిష్ట పరిస్దితులు సాధారణంగా ఉత్పన్నం కావన్నారు. ఏళ్ల తరబడి మోకాలి నొప్పులతో బాధపడేవారు ఉపశమనం పొందుతారని, దీర్ఘకాలికంగా ఇది రక్షణ ఇస్తుందన్నారు. సాధారణంగా వయసు మీద పడినవారు, క్రీడాకారులలో ఇటువంటి అసౌకర్యం కనిపిస్తుందని వివరించారు. మోకాలి మార్పిడి చికిత్స చేయించుకొని నొప్పి తగ్గనివారు సైతం ఈ సర్జరీ చేయించుకోవచ్చునని డాక్టర్ రాజా తెలిపారు. ఈకొత్త సర్జరీతో నడక,పరుగు పూర్తిగా మెరుగుపడతాయని, దీనితో రానున్న కాలంలో కీళ్ల మార్పిడి ఆలోచనను పొడిగించడం లేదా పూర్తిగా రద్దుచేసుకోవడం వంటి ఉపయోగాలున్నాయని డాక్టర్ రాజా తెలిపారు. అదేవిధంగా భుజం నొప్పికి కూడా ఈ విధానంలో మంచి చికిత్స లభిస్తుందని చెప్పారు. కుట్లు,కోతలు లేని ఈ విధానంలో త్వరగా నొప్పినుంచి విముక్తి పొందుతారని ఆయన వివరించారు. ఈ జిఎఈ విధానం వలన ఆస్టియో ఆర్ధరైటిస్, టెండీనిటీస్, సైనోవైటిస్, కీలు అతివాడకం వలన సంభవించే నొప్పులకు పరిష్కారం లభిస్తుందని డాక్టర్ రాజా స్పష్టం చేశారు. ఈ నూతన చికిత్సా విధానంపై మరిన్ని వివరాలకు 72077 74883 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చునని తెలిపారు.