Site icon NTV Telugu

Vikarabad TRS : సీఎం కేసీఆర్ టూర్ తో నేతలమధ్య విభేదాలకు ఫుల్స్టాప్ పడినట్టేనా..?

Vikarabad Trs

Vikarabad Trs

Vikarabad TRS :ఆ జిల్లా టీఆర్ఎస్‌లో రాజీనామాలు లేనట్టేనా? సీఎం కేసీఆర్‌ టూర్‌తో క్లారిటీ వచ్చిందా? నేతల మధ్య విభేదాలకు ఫుల్‌ స్టాప్‌ పడినట్టేనా? మున్సిపల్‌ తగాదాలకు ఎలాంటి చికిత్స చేశారు? లెట్స్‌ వాచ్‌..!

కొద్దిరోజులుగా వికారాబాద్‌ జిల్లా టీఆర్ఎస్‌లో ఒకటే రచ్చ. ప్రజాప్రతినిధుల మధ్య ఉప్పు నిప్పులా మారిపోయింది ఆధిపత్యపోరాటం. అలాంటిది సీఎం కేసీఆర్‌ పర్యటన తర్వాత ఆ జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు తాండూరు, వికారాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్‌ చేసిన ఎమ్మెల్యేల వర్గీయులు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పుడున్న ఛైర్‌పర్సన్లు తమ పదవులకు రాజీనామా చేస్తే.. కొత్త వారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. దానిపైనే పార్టీలో పెద్ద గొడవ జరుగుతోంది. ఛైర్‌పర్సన్లు ఇద్దరూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్గం కావడంతో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, పైలట్‌ రోహిత్‌రెడ్డిలు కుతకుతలాడుతున్నారు. ఈ మార్పుకోసం చేపట్టిన ఎత్తుగడలు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లాయి.

మున్సిపాలిటీలో ఉన్న మిగతా మహిళా ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి పంతాలు నెగ్గించుకోవాలని ఎమ్మెల్యేలు ఆనంద్‌, రోహిత్‌రెడ్డిలు చూడటంతో టీఆర్ఎస్‌ రాజకీయాలు సెగలు పుట్టించాయి. దీనికి పట్నం వర్గం విరుగుడు మంత్రం వేసినట్టు ప్రచారం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉపఎన్నికకు సిద్ధం అయ్యారు. బీజేపీలో చేరేందుకు రాజగోపాల్ రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చేరికలకు బీజేపీ ఫోకస్‌ పెట్టింది. ఇదే అదనుగా భావించిన వికారాబాద్‌, తాండూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు అవసరమైతే TRSకు రాజీనామా చేస్తామనే సంకేతాలు ఇవ్వడంతో కలకలం రేగింది.

ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపాలిటీలలో రాజీనామాల అంశాన్ని ఎక్కువగా పట్టించకోక పోవడం మంచిదని పార్టీ వర్గాలు భావించాయట. ఇతర జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో ఇలాంటి సమస్యలు తెరమీదకు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని టిఆర్ఎస్ అధిష్ఠానం దృష్టికి సీనియర్లు తీసుకెళ్లారట. దీంతో మున్సిపల్ చైర్ పర్సన్స్ రాజీనామా అంశాన్ని ఎక్కువగా ఫోకస్ చేయొద్దని ఎమ్మెల్యేలకు పార్టీ సూచించిందట. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి సైలెంట్ అయ్యారని జిల్లా టిఆర్ఎస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సీఎం పర్యటన తర్వాత ఒక సమస్య కొలిక్కి వచ్చిందని.. సీనియర్ నేతల మధ్య కూడా సయోధ్య కుదిరే ఉంటుందని చెవులు కొరుక్కుంటున్నారు. తాండూరు సీటుపై మహేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం సాగుతోంది. పైగా సీఎం పర్యటనలో మహేందర్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌, రోహిత్‌రెడ్డి ఇతర ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం లభించింది. ఎడముఖం పెడముఖంగా కనిపించకపోవడంతో.. అంతా సెట్‌ అయ్యిందని భావిస్తున్నారట.

 

Exit mobile version