Telangana Congress: మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు ఆ పార్టీకి సవాలుగా మారిందా?ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది?వ్యూహ రచన కమిటీ కన్వీనర్ కనిపించకుండా ఎక్కడికి వెళ్లారు?ఆ ఇద్దరి నేతల మధ్య అసలే సయోధ్య కుదరటం లేదా?అందుకే ఆయనకు క్షేత్రస్థాయిలో పని చేయటానికి ఇష్టపడటం లేదా?ఇంతకీ..కనిపించకుండా పోయిన ఆ నేత ఎవరు?
తెలంగాణ కాంగ్రెస్ మునుగోడు ఉపఎన్నికను సవాలుగా తీసుకుంది. రాజగోపాల్ రెడ్డిని ఓడించడం…సిట్టింగ్ సీటు గెలుచుకోవడం ఆ పార్టీకి ఇప్పుడు పెద్ద టాస్క్‌గా మారింది. రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా ప్రకటన చేసిన వెంటనే..పిసిసి….ఉపఎన్నిక వ్యూహ రచనకు కమిటీ వేసింది. పార్టీలో సీనియర్ నేతలు..నాన్ లోకల్ లీడర్లతో కమిటీ ఏర్పాటు చేసింది. సభకు కూడా ప్లాన్ చేసింది. కమిటీలో సభ్యులు అంతా అక్కడే ఉన్నా…కన్వీనర్ మాత్రం కనిపించడం లేదని టాక్. మునుగోడు ఉప ఎన్నిక వ్యూహ రచన కోసం మధుయాష్కీని కన్వీనర్‌గా నియమించింది. ఐతే…ఇప్పటి వరకు అయన గ్రౌండ్‌కు వెళ్లిన దాఖలాలే లేవట.
మునుగోడులో రాజగోపాల్ రెడ్డి వెంట కాంగ్రెస్ క్యాడర్ వెళ్లకుండా…సన్నాహక సమావేశం పేరుతో సభను ఏర్పాటు చేసింది. సభకు కమిటీ సభ్యులు…జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఉత్తమ్, జానారెడ్డి హాజరయ్యారు. ఐతే..పార్టీ వ్యూహరచన కమిటీ కన్వీనర్ మధుయాష్కీ మాత్రం కనిపించలేదు. కమిటీ వేసి ఇప్పటికే వారం గడిచింది. మునుగోడు మీద పెద్దగా నజర్ పెట్టినట్టు కనిపించటంలేదట. పిసిసి చీఫ్ రేవంత్…యాష్కీ మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. రెడ్డి సామాజికవర్గాలకే పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటి నుంచి అయన కొంత అసహనంతో ఉన్నారని కూడా తెలుస్తోంది. ఇదే అంశంపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
మునుగోడు నియోజకవర్గంలో బీసీల ఓటు బ్యాంక్ ఎక్కువ. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ అన్ని సామాజికవర్గాలను కూర్చి ఓ కమిటీ వేసింది. దీనికి యాష్కీగౌడ్‌ను కన్వీనర్‌ను చేసింది. మునుగోడులో గౌడ…యాదవ, చేనేతల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని…కమిటీ వేసింది. ఐతే ఇప్పటి వరకు కమిటీ సభ ఏర్పాటు వరకే పరిమితమైంది. క్యాడర్‌ను సంసిద్ధం చేసే పని మాత్రం జిల్లా నాయకత్వం చేపట్టింది. వ్యూహరచన కమిటీ కన్వీనర్‌గా ఉన్న యాష్కీ కమిటీ వేసినప్పటి నుంచి పెద్దగా కనిపించడం లేదనే టాక్ ఉంది.
ప్రచార కమిటీ అయితే వేశారు కానీ.. ఏం చేయాలనే క్లారిటీ లేక సైలెంట్‌గా ఉన్నారనే టాక్ కూడా ఉంది.