Site icon NTV Telugu

Parvathipuram Ticket war.. Off The Record: పార్వతీపురంలో టికెట్ రచ్చ

Maxresdefault

Maxresdefault

రాజకీయంగా ఎదిగేందుకు ఆయన ఒక సైన్యాన్నే తయారు చేసుకున్నారు. కొందరు పెద్దల దీవెనలతో జిల్లాలోనే తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. అనతికాలంలోనే అందలాలు ఎక్కారు. ఐతే…ఎత్తు పల్లాలను మరిచిపోయిన ఆ నాయకుడు చేయూతనిచ్చిన వారిపైనే ఎదురు తిరిగాడు. రోజులు ఒకేలా ఉండవు కదా‌‌?ఆ నాయకుడు విమర్శించిన నేతే ఇప్పుడు అధ్యక్షుడయ్యాడు. అంతే…ఇంకేముంది…అక్కడ రివెంజ్ పాలిటిక్స్‌ షురూ అయ్యాయ్. ఇంతకీ…ఎవరా నాయకులు?ఏంటా కథా?

పార్వతీపురం వైసీపీలో వర్గ పోరు
పార్వతీపురం వైసీపీలో వర్గ పోరు ముదురుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే విభేదాలు బయటపడుతున్నాయి. జిల్లా అధ్యక్షులు, వచ్చే ఎన్నికల్లో టికెట్ అశించే నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడుతోంది. వీరి మధ్య వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. బొత్స కుటుంబానికి అనుచరుడిగా రంగంలో దిగిన జోగారావు ఇక్కడి నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపొందారు. అప్పుడు ఆ పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షుడు పరీక్షిత్తు రాజు తన సహాయ సహకారాలను అందించారు. జమ్మాన ప్రసన్న కూడా ప్రస్తుత ఎమ్మెల్యే గెలుపునకు కృషి చేశారు.

అధిపత్యం కోసం పోటీపడుతున్న జోగారావు
ఐతే…గెలిచిన తరువాత జోగారావు వ్యవహారం మరోలా మారిందట. తన అధిపత్యం కోసం జోగారావు పోటీపడుతున్నారని టాక్‌. జిల్లాల పునర్విభజన తరువాత పార్వతీపురం కేంద్రంగా అంతా తానై ఉండాలనే భావిస్తున్నారు. సాయం చేసిన వారిపైనే ఎదురు తిరుగుతున్నారట. ఎన్నికల్లో ఘన విజయానికి సహకరించిన పరీక్షిత్‌ రాజు, పుష్ప శ్రీవాణి, ప్రసన్నపైనే ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

శ్రీవాణిపై ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్ర విమర్శలు
పుష్ప శ్రీవాణి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న సమయంలో జోగారావు‌ సిఫార్సులతో పనులు చేయించుకునే వారట. పుష్పశ్రీవాణి తన మాటకు ఎదురు చెప్పరని జోగారావు అనుచరులతో చెప్పుకునేవారట. ఐతే…పుష్ప శ్రీవాణి …జోగారావు ఒత్తిడిని తట్టుకోలేక చివరికి దూరం పెట్టారు. దీంతో శ్రీవాణిపై ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్ర విమర్శలు చేయటం మొదలు పెట్టారట. చివరికి జిల్లా విభజన తరువాత శ్రీవాణి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న సమయంలో జోగారావు తన అనుచర గణంతో జేజేలు కొట్టించుకొని… శ్రీవాణిని అవహేళన చేశారని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

రివెంజ్ పాలిటిక్స్ చేసేందుకు పరీక్షిత్తు రాజు రెడీ
ఇక…పుష్ప శ్రీవాణి…జోగారావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పరీక్షిత్తు రాజు బాధ్యతలు చేబట్టబోతున్నారు. దీంతో ఆనయపై గతంలో ఫైర్ అయిన జోగారావు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారట. ఇంతవరకు అందర్నీ దూరం చేసుకున్న జోగారావుపై రివెంజ్ పాలిటిక్స్ చేసేందుకు పరీక్షిత్తు రాజు సిద్దపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. జోగారావు అక్రమాలపై చిట్టా తయారు చేసి…అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. ఇటీవల జగనన్న కాలనీలో స్థలాల కేటాయింపు విషయంలో జోగారావు జోక్యం ప్రధానంగా ప్రస్తావించాలని చూస్తున్నారు. జోగారావు ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారని చెప్పుకుంటున్నారు క్యాడర్. జమ్మాన ప్రసన్న కూడా జోగారావుపై పెద్దలకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.

పరీక్షిత్తు రాజు వర్గం, జమ్మాన ప్రసన్నతో పాటు నియోజవర్గంలో జోగారావును వ్యతిరేకించిన వర్గం ఏకం అవుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే తనదైన శైలిలో పాత పరిచయాలతో బొత్సకు దగ్గరవుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే జోగారావు ఏకాకిగా మిగిలిపోయారు. మరి…ఎమ్మెల్యే జోగారావుకు రాబోయే ఎన్నికల్లో సీటు దక్కుతుందా?లేదా?చూడాల్సిందే.

Exit mobile version