Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Otr Bjp Gears Up For Telangana Municipal Elections High Stakes For Mps And Central Leadership

OTR: మున్సిపల్‌ యుద్ధం కోసం కాషాయ దళం కత్తులు.. ఈసారి సీరియస్‌గా ఉన్న కేంద్ర పార్టీ!

Published Date :February 4, 2026 , 9:30 pm
By Kothuru Ram Kumar
OTR: మున్సిపల్‌ యుద్ధం కోసం కాషాయ దళం కత్తులు.. ఈసారి సీరియస్‌గా ఉన్న కేంద్ర పార్టీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

OTR: మున్సిపల్ ఎన్నికల్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు అగ్ని పరీక్షగా భావిస్తున్నారా? తేడా పడితే…. రేపు ఢిల్లీలో ముఖం చూపించుకోలేమని ఫీలవుతున్నారా? కేంద్ర నాయకత్వం కూడా అదే అభిప్రాయంతో ఉండటం ఎంపీల్ని కంగారు పెడుతోందా? ఇప్పుడు చెమటోడ్చకపోతే…. రేపు చిన్న చిన్న పనులు కూడా కావన్న భయం కాషాయ ఎంపీల్లో పెరుగుతోందా? గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న మంత్రాంగం ఏంటి?

తెలంగాణ మున్సిపల్ యుద్ధం కోసం అన్ని రకాల అస్త్ర శస్త్రాలతో రంగంలోకి దిగుతున్నాయి ప్రధాన రాజకీయ పక్షాలు. ఇవి పార్టీ సింబల్స్‌తో జరిగే ఎన్నికలు కావడం, ఎవరి బలమేంటో బయటపడే ఛాన్స్‌ ఉండటంతో… వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా అంతా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే… కాషాయ దళం కూడా గట్టిగానే కత్తులు నూరుతోందట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ… అధిష్టానం ఈ మున్సిపల్‌ ఎలక్షన్స్‌ని సీరియస్‌గా తీసుకుందట. ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర పార్టీ… ప్రత్యేక ఇన్ఛార్జ్‌లను నియమించింది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఈ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు.

OTR : నందిగం సురేష్‌కు షాక్..! నిన్నటి అనుచరులే నేడు శత్రువులా..?

దీన్నిబట్టే మున్సిపల్‌ ఎలక్షన్స్‌ని ఆ పార్టీ ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్ధమవుతోందంటున్నారు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలోని పార్టీ ఎంపీలకు సంకటంగా మారినట్టు తెలుస్తోంది. కేంద్ర పార్టీ ఆ స్థాయిలో సీరియస్‌గా ఉన్నందున ఎంపీలకు ఈ ఎలక్షన్స్‌ ఛాలెంజ్‌గా మారాయన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏదో…. జరిగేదో జరిగిపోతుందిలే అంటూ… గతంలో లాగా ఈజీగా తీసుకునే అవకాశం వాళ్ళకు లేకుండా పోయిందంటున్నారు. పార్టీ ఎంపీలకు పార్లమెంట్ సమావేశాల నుంచి కూడా మినహాయింపు ఇచ్చారంటేనే… తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్ని కమలం హైకమాండ్‌ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందో అర్ధమవుతుందని అంటున్నారు పరిశీలకులు. దీంతో మరోమాట లేకుండా బీజేపీ ఎంపీలు ఈ ఎన్నికలను నెత్తిమీద వేసుకొని తిరుగుతున్నారట.

తమ పరిధిలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెల్చుకుని సత్తా చాటడం కోసం కేంద్ర పార్టీ తమకు పెట్టిన అగ్ని పరీక్ష ఇది అంటూ ఒకరిద్దరు ఎంపీలు సన్నిహితుల దగ్గర అంటున్నట్టు సమాచారం. ఇక ఢిల్లీ పెద్దల మనసేంటో అర్ధం చేసుకున్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు తమలో తాము పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. మిగతా వాళ్ళ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుని ఆధిపత్యం చాటడంతోపాటు పార్టీ ముఖ్యుల మనసు కూడా గెల్చుకోవాలని భావిస్తున్నారట కొందరి కమలం పార్లమెంట్‌ సభ్యులు. అందుకే….. అభ్యర్థుల ఎంపిక, ప్రచార బాధ్యతల్ని పూర్తిగా తమ భుజాల మీద వేసుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు. రేపు పక్కవాళ్ళతో పోలిక వచ్చినప్పుడు తాము తక్కువ కాకుండా ఉండటం కోసం తమ పరిధిలోని మున్సిపాలిటీలన్నిటినీ చుట్టేస్తున్నారట ఎంపీలు. బీజేపీకి అర్బన్‌ పార్టీ ఇమేజ్‌ ఉంది. అందుకు తగ్గట్టే…. ఎంపీలు గెలిచిన నియోజకవర్గాల్లో పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఓట్లు పడ్డాయి.

T20 World Cup 2026: సంజూ శాంసన్‌కు షాక్.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఫిక్స్!

ఇప్పుడు ఆ ఓట్లన్నీ మున్సిపల్ అభ్యర్థులకు రాకుంటే… ఎంపీలు డిఫెన్స్‌లో పడే అవకాశం ఉందని, అందుకే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. ఒక వేళ తేడా వస్తే కేంద్ర పార్టీకి జవాబు చెప్పుకోవాలి. భవిష్యత్‌లో ఏదైనా కావాల్సి వస్తే అడగలేము, అందుకే ఈ ఎన్నికల్లో మనల్ని మనం నిరూపించుకోవాలని ఎంపీలు భావిస్తున్నట్టు తెలిసింది. ప్రధాని మోడీకి ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతల మీద సదభిప్రాయం లేదని, మున్సిపల్‌ ఎలక్షన్స్‌లో సత్తా చాటి ఆయన అభిప్రాయాన్ని కూడా మార్చాలని భావిస్తున్నారట పార్టీ ఎంపీలు. ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah Telangana campaign
  • BJP high command focus
  • BJP MPs pressure
  • BJP municipal elections Telangana
  • Nitin Nabin BJP

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions