Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Tdp Leaders Shock To Own Party

Off The Record: టీడీపీ నేతలే షాక్ ఇచ్చారా?

Published Date :February 27, 2023 , 9:57 pm
By NTV WebDesk
Off The Record: టీడీపీ నేతలే షాక్ ఇచ్చారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సీఎం సొంత జిల్లాలో MLC ఎన్నిక ఏకగ్రీవం కాకుండా టీడీపీ వేసిన ఎత్తుగడ చీదేసింది. అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటీ..! వెనుకా ముందు ఆలోచించకుండా విసిరిన పాచికలు రివర్స్‌ కొట్టాయి. సీన్‌ సీతారైంది. ఉన్నదీపాయే అని కేడర్‌ తల పట్టుకున్న పరిస్థితి. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.

టీడీపీ మద్దతుతో నామినేషన్‌ వేసిన రమణయ్య
ఉమ్మడి కడప జిల్లా స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో టీడీపీ అనుసరించిన వ్యూహం బెడిసికొట్టింది. స్థానిక సంస్థల్లోని ఓటర్లలో 98 శాతం మంది అధికారపార్టీ వైసీపీకి చెందిన వాళ్లే. మిగిలిన ఇండిపెండెంట్లు, టీడీపీ ప్రజాప్రతినిధుల ఓట్లు 60 వరకు ఉంటాయి. ఎంత పోరాటం చేసినా వైసీపీని కాదని ఒక్క ఓటు అదనంగా టీడీపీకి దక్కడం అంత సులువైన విషయం కాదు. ఈ సంగతి జిల్లా టీడీపీ నేతలకు తెలియంది కాదు. కానీ.. సీఎం సొంత జిల్లాలో వైసీపీ MLC అభ్యర్థి రామసుబ్బారెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ఏం చేయాలా అని తెగ జుట్టు పీక్కున్నారు జిల్లా టీడీపీ నేతలు. ఇంతలో టీడీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రమణయ్య యాదవ్‌ నామినేషన్‌ వేయడంతో ఎన్నికలు తప్పవనే భావన కలిగింది. కానీ… రమణయ్య యాదవ్‌ నామినేషన్‌ స్క్రూటినీలో పోవడంతో టీడీపీ కథ అడ్డం తిరిగింది. అయితే ఈ సందర్భంగా జరిగిన పరిణామాలే రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి.

ప్రతిపాదిత సంతకాలు తమవి కావని టీడీపీ కౌన్సిలర్లు ఫిర్యాదు
రమణయ్య యాదవ్‌ నామినేషన్‌ పత్రంలో తాము ప్రతిపాదిత సంతకాలు చేయలేదని ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లు ఫిర్యాదు చేయడంతో సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఆ సంతకాలు తమవి కావని ఏకంగా ఎన్నికల అధికారికే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు ఆ టీడీపీ కౌన్సిలర్లు. వారే ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని ఏకైక టీడీపీ కౌన్సిలర్‌ శివజ్యోతి, మైదుకూరు మున్సిపాలిటీలోని టీడీపీ కౌన్సిలర్లు వెంకట సుబ్బారెడ్డి, ఖాదర్‌ బాషా. దీంతో అభ్యర్థి రమణయ్య యాదవ్‌తో పాటు జిల్లా టీడీపీ నేతలు షాక్‌ తిన్నారు. ఎన్నికల అధికారి ఎదుట రమణయ్య యాదవ్‌ బిక్కముఖం వేశారు. ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడం ఓ ఎత్తు అయితే.. ఎన్నికల నియమావళి ప్రకారం చట్టబద్ధంగా నడుచుకుంటానని ప్రమాణం చేసి.. తప్పుడు వివరాలు ఇచ్చినందుకు రమణయ్య క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సి వస్తోంది.

టీడీపీకి చెందిన నేతలే తెరవెనుక షాక్‌ ఇచ్చారా?
వైసీపీ ప్రలోభపెట్టి తమ ముగ్గురు కౌన్సిలర్లతో తప్పుడు ఫిర్యాదు చేయించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నప్పటికీ.. ఈ ఎపిసోడ్‌లో మరో చర్చా నడుస్తోంది. ఈ ముగ్గురు కౌన్సిలర్లు రివర్స్‌ కావడంలో టీడీపీకే చెందిన ఓ మైనారిటీ నాయకుడు… మరో మండలస్థాయి నేత కీలక పాత్ర పోషించినట్టు చర్చ సాగుతోంది. కౌన్సిలర్‌ శివజ్యోతి భర్త కుతుబుద్దీన్‌ టీడీపీకి చెందిన TNTUC జిల్లా అధ్యక్షుడు. అలాంటి నాయకుడి సతీమణే ప్లేటు ఫిరాయించడంతో హాట్ టాపిక్‌గా మారింది. పైగా మైదుకూరు టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నియోజకవర్గంలోని కౌన్సిలర్ల తీరు కూడా తెలుగు తమ్ముళ్లకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికలను జిల్లా టీడీపీ నేతలు సీరియస్‌గా తీసుకోలేదా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తలవంపులు తెచ్చేలా సీనియర్‌ నాయకులు వ్యవహరించారనే ప్రచారం జరుగుతోందట. టీడీపీ జిల్లా అధ్యక్షులు, నామినేషన్‌కు పురమాయించిన నేతలు సీరియస్‌గా లేరన్న విమర్శలు కేడర్‌లో వినిపిస్తున్నాయి. బలం లేని చోట అభ్యర్థిని పోటీకి పెట్టినప్పుడు.. స్థానిక సంస్థల్లోని తమ ప్రజాప్రతినిధుల కదలికలపై నజర్‌ పెట్టాలి. నామినేషన్‌లో ప్రతిపాదితులుగా సంతకాలు పెట్టినవాళ్లను కాపాడుకోవడం అత్యంత కీలకం. ఈ విషయం తెలిసినా అంతా లైట్‌ తీసుకున్నారనే చర్చ నడుస్తోంది. మొత్తానికి ఉమ్మడి కడప జిల్లా టీడీపీలో ఏ కార్యక్రమం నిర్వహించినా సమన్వయ లోపం ఉంటుందనేది MLC ఎన్నికల సందర్భంగా మరోసారి రుజువైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

  • Dehydration Symptoms: మండే ఎండల్లో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ పని అంతే! ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

  • CM Chandrababu: మొన్న మూడుముక్కలాట.. నిన్న మావిగన్.. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions