Site icon NTV Telugu

Off The Record: తలనొప్పులు.. తుంగతుర్తి నుంచి తప్పుకోవాలని నిర్ణయం

Thungathurthi

Thungathurthi

తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదాల కేరాఫ్‌… నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం. పొలిటికల్ జేఏసీలో పనిచేసిన అద్దంకి దయాకర్…2014, 2018 ఎన్నికల్లో దయాకర్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఓ సారి కోమటిరెడ్డి బ్రదర్స్… ఇంకోసారి దామోదర్ రెడ్డి ఓడించారనేది అద్దంకి దయాకర్‌ ప్రధాన ఆరోపణ. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ రాజకీయ పరిణామాలన్ని మారిపోయాయి. అద్దంకి దయాకర్‌కి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేత దామోదర్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శత్రువులుగా మారిపోయారు. ఏఐసీసీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలపై ఫిర్యాదు చేశారు. డాక్టర్ రవి చేరిక విషయంలో చెలరేగిన వివాదం…అద్దంకిని రాజకీయంగా ఇరుకున పెట్టె వరకు వచ్చింది. దీనికి తోడు దామోదర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే వరకు వ్యవహారం నడిచింది. ఇలా తుంగతుర్తి నియోజకవర్గంలో అద్దంకి దయాకర్‌కి తలనొప్పులు ఎక్కువయ్యాయి. మళ్లీ పోటీ చేస్తే ఇన్నాళ్లు దామోదర్ రెడ్డి తోటే సమస్య… ఇప్పుడు అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి… ఇటు ఉత్తంకుమార్ రెడ్డి తలకుభారంగా మారిపోయారు. దీంతో భవిష్యత్తు రాజకీయాల పై కొంత క్లారిటీ తెచ్చుకోవాలని అద్దంకి దయాకర్ నిర్ణయించుకున్నారట.

Read Also: Off The Record: వంగవీటి చుట్టూ బెజవాడ రాజకీయం.. మళ్లీ సేమ్‌ సీన్‌..!

తుంగతుర్తి నియోజకవర్గ నుంచి అద్దంకి దయాకర్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. తుంగతుర్తి నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ నియోజకవర్గానికి రావాలని నిర్ణయించుకున్నారట. అందుకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అంగీకరించినట్టు తెలిసింది. ఇప్పటికే కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ ప్రీతం పని చేసుకుంటున్నారు. తుంగతుర్తిలో వచ్చిన సమస్యలతో… అద్దంకి కంటోన్మెంట్‌కి రావాలని నిర్ణయం తీసుకోవడం… ప్రీతంతో పరస్పర అవగాహనకి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రీతం కూడా… తుంగతుర్తి నియోజక వర్గం స్థానికుడు. ఆయన కూడా అక్కడ పోటీ చేయాలని ప్రయత్నం చేశారట. కానీ అక్కడ అద్దంకి ఉండటంతో… ప్రీతం నగరం మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు అద్దంకినే… సిటీకి వస్తానని చెప్పడంతో…ప్రీతంకు లైన్ క్లియర్ అయిదంట.

మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మద్దతు కోసం ప్రీతం ప్రయత్నాలు పెట్టారట. ఆయన అనుచరులు కూడా కలిశారట. అయితే దామోదర్ రెడ్డి సపోర్ట్‌ లేకుండా గెలవడం కష్టమని భావించిన ప్రీతం…దామోదర్‌రెడ్డి కోసం తిరుగుతున్నారట. ఆయన ఒప్పుకుంటేనే తుంగతుర్తి వస్తానని చెప్పేశారట. లేదంటే రెంటికి చెడ్డ రెవడి అవుతుందని చెప్పుకుంటున్నారట. ప్రీతమ్‌కు అటు ఉత్తమ్..ఇటు కొమటిరెడ్డి వెంకటరెడ్డి..భట్టిలతో మంచి రిలేషన్ ఉంది. దామోదర్ రెడ్డి ఓకె అంటే వెళ్ళడానికి ప్రీతం కూడా సిద్ధం అయ్యారట. అద్దంకి… ప్రీతం…నియజక వర్గాల మార్పుకి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Exit mobile version