Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మార్పు వెనుక అసలు కథ.. ఢిల్లీ పెద్దల బిగ్ స్కెచ్ ఇదేనా..?
- మీనాక్షి స్థానంలో సూపర్ సీనియర్ని పంపుతారని అంచనాలు..
- నోరు జారుతున్న కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు..
- కర్ణాటకకు చెందిన సందీప్‌ను ఇన్‌ఛార్జ్‌గా పంపడంపై చర్చలు..
- అంతా సీనియర్సే, మరో సీనియర్ ఎందుకనుకున్నారా?..
- జస్ట్.. అందర్నీ కలుపుకుని వెళ్ళే నేత చాలన్న లెక్కలున్నాయా?..
- పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రికి ఫ్రీ హ్యాండిచ్చినట్టేనా?..
- ఇన్‌ఛార్జ్‌గా సీనియర్ అంటే మరో పవర్ సెంటర్ అన్న ఫీలింగా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్ విదేశాలకు వెళ్ళారు. దాంతో… ఆమె స్థానంలో చాలా సీనియర్నుగాని, ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన నాయకుల్ని గానీ ఇన్‌ఛార్జ్‌గా పంపిస్తారంటూ పార్టీ వర్గాల్లో గట్టి చర్చలే నడిచాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటం, క్రమశిక్షణ కట్టు తప్పుతుండటం లాంటి పరిణామాలతో ఏఐసీసీ సీనియర్స్కే ప్రాధాన్యం ఇస్తుందని భావించారు అంతా. అధికార పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు అప్పుడప్పుడు నోరు జారడం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పుడే ఇలా ఉంటే… రేపు ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయో, ఆసంతృప్తులు బయటపడి ఏ టర్న్ తీసుకుంటాయోనన్న ఆందోళన సైతం హస్తం వర్గాల్లో ఉంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని… ఇన్‌ఛార్జ్‌గా సీనియర్ నేతను పంపుతారన్న ప్రచారం జరిగింది. కానీ… అలాంటిదేం లేకుండా… కర్ణాటకుకు చెందిన బి ఎం సందీప్‌ను నియమించారు. దాంతో… ఇది దేనికి సంకేతం…? తెలంగాణ కాంగ్రెస్ నేతలపై అధిష్టానానికి కాన్ఫిడెన్స్ ఎక్కవా? అన్న చర్చలు మొదలయ్యాయి.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు… ఇప్పుడు ఇక్కడ కొట్టుకోవడం లేదు గానీ… హస్తిన వేదికగా రాజకీయ చక్రం తిప్పుతున్నారు. ఈ పరిస్థితిలో నలుగురితో మాట్లాడి.. వ్యవహారాలు సాఫీగా సాగేలా చూస్తే సరిపోతుందని ఫిక్స్ అయ్యారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట కొందరికి. ఇక్కడ సీనియర్ నేతలున్నా… అందర్నీ కలుపుకుని వెళ్ళడానికి ఒక ఇన్ఛార్జ్ కావాలి కాబట్టి సందీప్‌ని పెట్టారు తప్ప అంతకు మించిన ప్రాధాన్యం ఏం ఉండకపోవచ్చన్నది కొందరి వాదన. పార్టీ నిర్మాణం గురించి తెలిసిన వ్యక్తి అవ్వడంతోనే సందీప్‌ను ఇన్చార్జ్గా నియమించారని చెప్పుకుంటున్నారు. అలాగే… ఈ నియామకం ద్వారా… స్టేట్ పార్టీ చీఫ్ మహేష్ గౌడ్‌కు, సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన సంకేతాలందుతున్నాయంటున్నారు కొందరు. తెలంగాణ నాయకత్వం విషయంలో అధిష్టానం కాన్ఫిడెంట్‌గా ఉందా..! అంటే… పరిస్థితుల్ని చూస్తుంటే అలాగే అనిపిస్తోందంటున్నారు. సీనియర్ నేతను ఇన్‌ఛార్జ్‌గా పెట్టి మరో పవర్ సెంటర్‌ని తయారు చేయడం ఎందుకన్న ఆలోచనలో ఏఐసీసీ పెద్దలు ఉండి ఉండవచ్చంటున్నారు. రాష్ట్రంలో నమ్మకమైన నాయకత్వం ఉండటం వల్ల కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చంటున్నారు. మొత్తానికి ఈ నియామకం ద్వారా… రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి ఢిల్లీ పెద్దలు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అర్ధమవుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
IFFI 2026: గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మెగాస్టార్ సినిమా సందడి.. దేశవ్యాప్తంగా ఆ 5 చిత్రాల్లో ఒకటిగా రికార్డ్!
-
Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మార్పు వెనుక అసలు కథ.. ఢిల్లీ పెద్దల బిగ్ స్కెచ్ ఇదేనా..?
-
Trump Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై 25, చైనాకు 40 శాతం..
-
CM Chandrababu: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే కందిపప్పు, పామాయిల్..
-
Siddharth Galla Wedding: కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేష్ బాబు మేనల్లుడు! వియత్నాంలో గ్రాండ్ వెడ్డింగ్!
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!