OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?
- ఆయన వస్తానంటే...కొందరు వద్దన్నారు
- ఇప్పుడా నేతల మౌనవ్రతం
- చూసీ చూడనట్టుగా, వినీ విననట్టుగా నోటికి తాళం
- హైకమాండ్ పెద్దలంటే భయమా...వారిచ్చిన అభయమా?
- అధిష్టానం ఎలాంటి మంత్రంతో వారిని సైలెంట్ చేసింది?
- విదేశాల నుంచి కేటీఆర్ రాగానే జీవన్ రెడ్డి కారెక్కుతారా?
- జీవన్ రెడ్డి రాకను బీఆర్ఎస్లో కొందరు నేతలు వ్యతిరేకించారా?
- పెద్ద పదవుల తర్వాత జీవన్ రెడ్డి సైతం పార్టీని వదిలేస్తారని నేతల డౌట్స్
- అధిష్టానం బుజ్జగించిందా?
- భయపెట్టిందా...అభయమిచ్చిందా?
- జీవన్ రెడ్డిని వద్దన్న నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. విదేశీ పర్యటనలో వున్న కేటీఆర్….హైదరాబాద్కు రాగానే పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి కారెక్కుతారన్న చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. అటు జీవన్ రెడ్డి వర్గం, ఇటు బీఆర్ఎస్ అధిష్టానం ఈ విషయాన్ని బలపరచకపోయినా….ఆయన గులాబీ తోటలోకి చేరడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రచారం మొదలైన మొదట్లో…. జీవన్ రెడ్డి రాకను బీఆర్ఎస్ లో కొందరు నేతలు వ్యతిరేకించారని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరిగింది. ముఖ్యంగా ఎల్.రమణ, గంగుల కమలాకర్… జీవన్ రెడ్డిని చేర్చుకోవద్దని అధిష్టానానికి పదేపదే విన్నవించారన్న గుసగుసలు అన్నీ ఇన్నీ కావు. జీవన్ రెడ్డి లాంటి వాళ్లను పార్టీలోకి తీసుకుంటే మరో కే.కేశవ రావు, డి.శ్రీనివాస్ అవుతారని అన్నారట. అలాంటి వారిని తీసుకుని, పెద్దపెద్ద పదవులు కట్టబెట్టినా సరే చివరకు వారు బీఆర్ఎస్ను వదిలి వెళ్లారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారట. జీవన్ రెడ్డి విషయంలోనూ అదే జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం చేశారట. ఇలా జీవన్ రెడ్డి రాకను ఇంతెత్తున వ్యతిరేకించిన నేతలు….ఆల్ ఆఫ్ సడెన్గా సైలెంట్ అయిపోవడం చర్చనీయాంశమైంది. అధిష్టానం వారి బుజ్జగించిందా….భయపెట్టిందా…అభయమిచ్చిందా అనే డిస్కషన్ హాట్హాట్గా సాగుతోంది. వద్దన్న నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారన్న డిస్కషన్ వాడివాడిగా సాగుతోంది.
READ ALSO: Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?
Also Read
- OTR : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారారా?
- OTR : వైసీపీ అధిష్టానం కఠిన నిర్ణయాలకు సిద్ధం అయిందా? ఆ ముగ్గురు నేతల పరిస్థితి ఏంటి?
- OTR : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీరుపై సీఎం రేవంత్ సీరియస్.. అసలు కారణం ఇదే
- OTR : సొంత వైఎస్సార్సీపీకి షాకిస్తున్న ఎమ్మెల్సీ.. పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వెనుక ఆంతర్యమేంటి?
మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయనకు ఉన్న ఇమేజ్ పార్టీకి కలిసొస్తుందని నేతలకు సర్ది చెబుతోందట గులాబీ అధిష్టానం. ముఖ్యంగా జీవన్ రెడ్డి కారెక్కితే తమకు ఇబ్బంది అవుతుందని భావిస్తున్న ఎల్.రమణ, గంగుల వంటి నేతలకు అనేక సమీకరణాలు వివరిస్తోందట. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కూడా జరగబోతుందని అభయమిస్తోందట. ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఉత్తర తెలంగాణలో కూడా చాలా శాసనసభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జీవన్ రెడ్డిని ఏదో ఒక నియోజకవర్గంలో సెట్ చేయవచ్చని చెబుతున్నారట. జీవన్ రెడ్డి వచ్చినంత మాత్రాన పాత నేతలకు ఇబ్బంది కలగదు అని మాట ఇస్తున్నారట అధిష్టానం పెద్దలు. ఎమ్మెల్యే సీట్లు పెరగడం వల్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్యాబినెట్ మంత్రుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని కొత్త ఆశలు చెబుతోందట. జీవన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నా మిగతా సీనియర్లకు కూడా కేబినెట్ బెర్తుల్లో ఢోకా వుండదని ధైర్యం చెబుతున్నారట. ఇలా నియోజకవర్గాల పునర్విభజన మంత్రంతో బీఆర్ఎస్ హైకమాండ్ జీవన్ రెడ్డి చేరిక అంశాన్ని సరళతరం చేసుకుంది. జీవన్ రెడ్డి తమ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాతవారికి ప్రాధాన్యత తగ్గదని ఉదాహరణలతో సహా చెబుతోంది. హైకమాండ్ భరోసాతో వస్తేరాని…. పోతేపోని అన్నట్టుగా మౌనంలోకి జారుకున్నారట సదరు నాయకులు.
తాజావార్తలు
-
Donga Naa Koduku: జాగ్రత్త.. ‘దొంగ నా కొడుకు’ వస్తున్నాడు! ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చూశారా..
-
Nani – Nithiin: 20 ఏళ్లలో ఎంత మార్పు.. ఒకప్పుడు నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు అదే హీరోకు నిర్మాతగా!
-
Manu Bhaker: జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
-
Amazon Sale: అమేజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్’లో అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్లపై ఏకంగా రూ.10 వేలు తగ్గింపు..
-
Supreme Court: సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 498A వర్తింపు.. కానీ, షరతులు వర్తిస్తాయి..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!