Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Is Sudhir Reddy Not Available For Cadre

Bojjala Gopalakrishna Reddy : సుధీర్ రెడ్డి క్యాడర్ కు అందుబాటులో లేరా..?

Published Date :September 9, 2022 , 11:45 am
By Premchand Chowdary
Bojjala Gopalakrishna Reddy : సుధీర్ రెడ్డి క్యాడర్ కు అందుబాటులో లేరా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bojjala Gopalakrishna Reddy  : గత ఎన్నికల్లో ఓడిన తర్వాత నియోజకవర్గంలో నల్లపూస అయిపోయారా? కేడర్‌ పిలిచినా ఎందుకు పలకడం లేదు? ఈ నెలలో పార్టీ అధినేత వస్తుండటంతో.. అప్పుడైనా ఇంఛార్జ్‌ కనిపిస్తారా? తెలుగు తమ్ముళ్లకు ఆయన తీరు అంతుచిక్కడం లేదా?

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ ఆరుసార్లు గెలిచింది. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఒక్కరే టీడీపీ నుంచి ఐదుసార్లు గెలిస్తే… ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా బొజ్జల తనయుడు సుధీర్‌రెడ్డే ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కూడా. ఒకప్పుడు శ్రీకాళహస్తిలో పార్టీకి బొజ్జల ఫ్యామిలీ అసెట్‌ అయితే.. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన సుధీర్‌రెడ్డి మైనస్‌ అయ్యారనేది తెలుగు తమ్ముళ్ల ఆవేదన. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోయారనేది శ్రీకాళహస్తి టీడీపీ కేడర్‌ ఆరోపణ. అధికార పార్టీపై పోరాటం చేస్తున్నా.. భరోసా ఇచ్చే వాళ్లే లేరని.. ఇంఛార్జ్‌ ఎక్కడున్నారో కూడా తెలియదని మండిపడుతున్నారట. మూడేళ్లుగా ఇంచుకూడా మార్పు లేదన్నది శ్రేణులు చెప్పేమాట.

ఆ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో శ్రీకాళహస్తిలో తళుక్కుమన్నారు బొజ్జల సుధీర్‌రెడ్డి. తర్వాత ఆయన తండ్రి గోపాలకృష్ణారెడ్డి ఆస్పత్రిలో చేరడంతో హైదరాబాద్‌కే పరిమిత అయ్యారు. గోపాలకృష్ణారెడ్డి మే నెలలో కాలం చేశారు. ఆ తర్వాత సుధీర్‌రెడ్డి మరీ నల్లపూసయ్యారనేది పార్టీ వర్గాల మాట. ఇంఛార్జ్‌ తీరుతో విసుగెత్తిన పార్టీ ద్వితీయశ్రేణి నేతలు.. కొందరు వైసీపీలోకి జంప్‌ అయిపోయారు. వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి.. ఇక్కడ టీడీపీని ఖాళీ చేసే పనిలో పడ్డారు. ఇదంతా తెలిసినా సుధీర్‌రెడ్డి టీడీపీ పరంగా చురుకైన పాత్ర పోషించడం లేదట.

ఈ నెల 16న బాదుడే బాదుడు కార్యక్రమం కోసం చంద్రబాబు శ్రీకాళహస్తి వస్తున్నారు. అప్పుడైనా ఇంఛార్జ్‌ సుధీర్‌రెడ్డి వస్తారా లేదో క్లారిటీ లేదట. ఈ సమస్య సుధీర్‌రెడ్డి వరకు చేరిందో ఏమో.. ఆయన వర్గం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిందట. కుటుంబ సమస్యల వల్లే శ్రీకాళహస్తికి రాలేకపోతున్నారని.. చంద్రబాబు కాలు పెట్టాక.. సరికొత్త సుధీర్‌రెడ్డిని చూస్తారని కేడర్‌కు బూస్టర్‌ డోస్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. అయితే సొంత పార్టీతోపాటు.. వైసీపీ నుంచి కూడా సుధీర్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వాటికి చెక్‌ పెట్టాలంటే సుధీర్‌రెడ్డి తీరు మార్చుకోవాలన్నది లోకల్‌ టీడీపీ నేతలు చెప్పేమాట. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచీ క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తేకానీ.. పార్టీకి పూర్వ వైభవం రాదనేది తమ్ముళ్ల వాదన. శ్రీకాళహస్తిలో టీడీపీ పుంజుకోవాలంటే యాక్షన్‌ ప్లాన్‌ మార్చాలని చెబుతున్నారు. ఈ దిశగా సుధీర్‌రెడ్డి పార్టీ పెద్దలు కూడా తగిన సూచనలు చేయాలని కేడర్‌ సూచిస్తోందట. మరి.. శ్రీకాళహస్తి టీడీపీకి చేసిన సుస్తికి పార్టీ ఎలాంటి మందు వేస్తుందో చూడాలి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Biyyapu Madhusudhan Reddy
  • bojjala gopalakrishna reddy
  • Bojjala Sudhir Reddy.
  • Sri Kalahasti
  • Telugu Desam Party

తాజావార్తలు

  • Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!

  • BSNL Rs.1 Plan: రూ.1 ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆఫర్ అదిరిపోయిందిగా.. నెల రోజుల పాటు ఫ్రీ..

  • Dhurandhar 2 : దురంధర్ 2 కలెక్షన్ల ఊచకోత.!

  • Delhi: ఢిల్లీ అసెంబ్లీ గేట్లు బద్దలుకొట్టి, దూసుకెళ్లిన కారు.. అతిపెద్ద భద్రతా వైఫల్యం..

  • Krithi Shetty: నందమూరి హీరోతో కృతి శెట్టి రొమాన్స్.. అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions