Site icon NTV Telugu

OTR: మాధవ్ వ్యవహారశైలిపై ఏపీ బీజేపీలో అసహనం పెరుగుతోందా?

Otr 2

Otr 2

OTR: ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేనంత విచిత్రమైన వాతావరణం ఏపీ బీజేపీలో ఇప్పుడు కనిపిస్తోందని పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నిటికీ మించి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ సరైన ట్రాక్‌లో నడిపిస్తున్నారా లేదా అన్న అనుమానాలు ద్వితీయ శ్రేణికి వస్తున్నాయట. రాష్ట్ర పార్టీ అంతకు ముందు ఎలా ఉంది? ఇప్పుడు ఏ పంథాలో నడుస్తోంది? కనీసం ఉనికి చాటుకునే ప్రయత్నం కూడా ఎందుకు జరగడం లేదంటూ వాళ్ళలో వాళ్లే ప్రశ్నించుకుంటున్నట్టు సమాచారం. ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం పేరిట సిద్ధాంతాలు వల్లెవేయడం తప్ప చేస్తోందేం లేదన్న అభిప్రాయం స్టేట్‌ కేడర్‌లో బలపడుతోంది. పార్టీ బలపడాలంటే ఓట్‌ బ్యాంక్‌ను పెంచుకోవడం ముఖ్యమని, ఆ పని మానేసి ఎంతసేపూ సిద్ధాంతాల గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే… జనం రేపు అసలు ఈవీఎంలో కమలం వైపు చూస్తారా అన్నది వాళ్ళ ప్రశ్న.

READ ALSO: Kalki 2 Update: ‘కల్కి 2’ సౌండ్ అద్భుతం.. హింట్ ఇచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్!

ఇంకొందరు నాయకులైతే కాస్త ఘాటుగానే రియాక్ట్‌ అవుతున్నారు. మూడేళ్ళు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టుగా టైంపాస్‌ చేస్తే… ఎలాగని అడుగుతున్నారు. ఏ అంశంలోనూ ఓపెన్‌గా మాట్లాడటంలేదని, అలా ఉంటే… జనంలో రిజిస్టర్‌ అయ్యేది ఎలాగని అడుగుతోంది కాషాయ కేడర్‌. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందని, అసలు సరైన అజెండానే లేకుండా…. ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా బండి లాగించేస్తున్నారన్నది పార్టీలోని ఓ వర్గం అభిప్రాయం. అదే సమయంలో గతంతో పోల్చి చూసుకుంటున్నారు కొందరు. పురందేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు టీడీపీ, జనసేనతో సమానంగా నడిచామని, ఇప్పుడు మాత్రం మనమింతే…. మనకు ఇంతవరకే అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని నాయకులు తమలో తాము చర్చించుకుంటున్నారట.

రాష్ట్ర అధ్యక్షుడంటే… దూకుడుగా ఉండాలి, కేడర్‌లో తిరగాలిగానీ… అదేదో ఢిల్లీ నాయకులు అడపాదడపా స్టేట్‌ టూర్‌కి వచ్చినట్టు బయటికి వచ్చి కేడర్‌ను కలవడం, అప్పుడు కూడా యాక్టివ్‌ పాలిటిక్స్‌ గురించి కాకుండా…. సిద్ధాంతాల గురించి మాత్రమే మాట్లాడ్డం వల్ల ప్రయోజనం ఏంటన్నది వాళ్ల క్వశ్చన్‌. సైద్ధాంతిక అంశాల గురించి కచ్చితంగా మాట్లాడాల్సిందేగానీ…. ఎప్పుడూ వాటి గురించి మాత్రమే చెబుతూ…. ఇతరత్రా కీలకమైన అంశాలను విస్మరిస్తే రాష్ట్రంలో పార్టీ ఎలా బలపడుతుందని అడుగుతున్నారు ఏపీ బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులు. ఏపీలో బీజేపీని బీసీల పార్టీగా చూపించాలని అనుకోవడం మంచిదేగాని…. ఆ దిశగా గట్టి కార్యాచరణ ఏదంటూ రాష్ట్ర పార్టీని నిలదీస్తున్నారు కార్యకర్తలు. కొందరైతే డైరెక్ట్‌ కామెంట్సే చేస్తున్నారట. వచ్చే మూడేళ్ళు ఎలాగూ అధికార భాగస్వామ్యం ఉంటుంది. ఈ ఈ టైంలో కళ్ళు మూసుకుని టైంపాస్‌ చేస్తే… ఆ తర్వాతి సంగతి అప్పుడు చూసుకోవచ్చని మాధవ్‌ భావిస్తున్నారా అంటూ… డైరెక్ట్‌గా కామెంట్‌ చేసే వాళ్ళ సంఖ్య కూడా పార్టీలో పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఓవరాల్‌గా ఏపీలో తెలుగుదేశం అనుబంధ పార్టీలా కాకుండా…. సొంతగా బలం పుంజుకునే దిశగా కార్యాచరణ ఉండాలన్నది కేడర్‌ మాట.

READ ALSO: OTR: టీజీవో, టీఎనీవో మధ్య కోల్డ్ వార్? డీఏ పెంపుతో బయటపడిందా ?

Exit mobile version