Why Tollywood Serious on Jani Master Issue: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అదే జానీ మాస్టర్ రేప్ కేసు. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు దీని గురించే చర్చ జరుగుతుంది. జానీ మాస్టర్ మైనర్ గా ఉన్న ఒక బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడడమే కాదు రేప్ కూడా చేశాడని ఆరోపణలు తెరమీదకి వచ్చాయి. ఆయన వద్ద గతంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన ఒక యువతి ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కంప్లైంట్ ను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ స్టేట్మెంట్ కోసం ప్రయత్నిస్తుంటే ఆయన అందుబాటులో లేడు. దీంతో పరారీలో ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా జరుగుతున్న రెండవ రోజు తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయం మీద మీడియాతో మాట్లాడింది.
Jr NTR: డైరెక్టర్ గారూ.. నాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేయండి.. ఎన్టీఆర్ అభ్యర్ధన!!
ఇక్కడ బాధిత యువతి తనకు అవకాశాలు కూడా రాకుండా జానీ మాస్టర్ చేస్తున్నాడని ఆరోపిస్తోంది కాబట్టి ఆ విషయంలో తాము సహాయం చేస్తామని అభయం ఇచ్చారు. ఒక హీరో ఇప్పటికే అండగా నిలబడతానని మాట ఇచ్చారని ఒక బడా ప్రొడ్యూసర్, ఒక బడా డైరెక్టర్ కూడా ఆమెకు అవకాశాలు ఇస్తామని ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. అయితే ఈ అంశం మీద ఇప్పటికే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బాధిత కొరియోగ్రాఫర్ మీడియా ముందుకు రాలేదు. అయినా సినీ పరిశ్రమ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఫిలిం ఛాంబర్ తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆమెకి అండగా ఉంటామని స్టేట్మెంట్ ఇచ్చేసింది.
అయితే ఇదే స్పీడు గతంలో శ్రీరెడ్డి విషయంలో ఎందుకు లేదు అనే చర్చ జరుగుతోంది. అయితే వాస్తవానికి శ్రీరెడ్డి వ్యవహారం తెరమీదకు వచ్చినప్పుడు ఈ అంశం మీద ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అంటే అప్పటివరకు ఇలాంటి కమిటీ ఏదీ లేదు. శ్రీ రెడ్డి ఇష్యూ తర్వాతే ఇలాంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందుకు కొంత టైం పట్టింది.. కానీ ఇప్పుడు జరిగిన ఇష్యూ తెరమీదకు వచ్చేటప్పటికీ కమిటీ ఏర్పాటు అయి ఉంది. కాబట్టి వెంటనే ఇష్యూని టేకప్ చేసి తమ వంతుగా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పటినుంచి ఈ కమిటీకి లైంగిక వేధింపుల విషయంలో ఎలాంటి కంప్లైంట్ వచ్చినా సరే సినీ పరిశ్రమ లిమిట్లో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పటివరకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయో లేదో తెలియదు కానీ ఈ విషయంలో కేసు తెరమీదకు రావడం కంటే ముందే ఆ కమిటీ దృష్టికి ఈ వ్యవహారం సదరు కొరియోగ్రాఫర్ తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది.
నేరుగా ఆమె వాళ్ళ దృష్టికి తీసుకు వెళ్ళలేదు కానీ ఎక్కడైతే తన ఇబ్బంది క్లియర్ అవుతుంది అనుకుందో అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ చివరికి కమిటీ దృష్టికి తీసుకు వెళ్లిందట. కమిటీ కూడా అన్నీ పరిశీలించి దీనికి చట్టబద్ధంగా ముందుకు వెళితేనే కరెక్ట్ అని చెప్పి పోలీసుల వద్దకు పంపించారట. కాబట్టి శ్రీ రెడ్డి విషయంలో పట్టించుకోలేదు ఈ అమ్మాయి విషయంలో పట్టించుకుంటున్నారు అనే వాదన ఇక్కడ కరెక్ట్ కాదు. నిజానికి ఏ మహిళ అయినా తమ కాళ్ళ మీద తన నిలబడేలా తన టాలెంట్ ని చూసి అవకాశం ఇచ్చేలా సినీ పరిశ్రమలో పరిస్థితులు కల్పించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ అని చెప్పొచ్చు.
అయితే జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేనలో యాక్టివ్ గా ఉన్నాడు కాబట్టి ఆయనను ఇక్కడ ఫ్రేమ్ చేస్తున్నారు అని వాదించే వాళ్లు కూడా లేకపోలేదు. అయితే జనసేన వెంటనే ఆయనను సస్పెండ్ చేయకుండా ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిందిగా ఆదేశించింది. తరువాత ఏమైనా ఆయన మీద ఆరోపణలు రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కానీ పార్టీలో యాక్టివ్ గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇరికిస్తున్నారు అనే వాదన మాత్రం నెటిజనులలో కొంతమంది తెరమీదకు తీసుకొస్తున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయ్ అనేది చట్టమే తేల్చాలి.