NTV Telugu Site icon

Jani Master: ఇదేం పని.. జానీ మాస్టర్ ?

Janimasters

Janimasters

What is this Jani Master : ఈరోజు మీడియాలో ఒకటే హాట్ టాపిక్. అదే జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం. తెలుగు సహా తమిళ, హిందీ సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇటీవల ఆయన చేసిన ఒక తమిళ సినిమాలో పాటకు గాను జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా వరించింది .ఆ ఉత్తమ అవార్డు ఇంకా తీసుకోక ముందే ఆయన తనను లైంగికంగా వేధిస్తున్నాడని పలుసార్లు రేప్ చేశాడు అంటూ ఆయన వద్ద గతంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందు ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఆమె నివాసం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి అక్కడికి జీరో ఎఫ్ఐఆర్ అంటూ పోలీసులు ట్రాన్స్ఫర్ చేశారు. సదరు యువతి చెబుతోన్న వివరాల ప్రకారం ఆమె వయసు ప్రస్తుతం 21 సంవత్సరాల మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆమె ఢీ షోలో సెలెక్ట్ కావడంతో హైదరాబాదుకి మకాం మార్చింది.

Kim : చంపేస్తావా కిమ్ మావా..!?

2017 వ సంవత్సరంలో ఆమెకు జానీ మాస్టర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఏర్పడిన కొన్ని రోజులకి ఆమెను తన అసిస్టెంట్ గా తీసుకునేందుకు జానీ మాస్టర్ ప్రయత్నించగా ఆమె రెండేళ్ల తరువాత జానీ మాస్టర్ టీం లో జాయిన్ అయినట్టు పేర్కొంది. జాయిన్ అయిన తర్వాత ఆమెను ఒకసారి ముంబై తీసుకెళ్లాడట. అప్పుడు జానీతో పాటు మరో ఇద్దరు మగ అసిస్టెంట్లు కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది. అయితే తన తల్లికి టికెట్లు వేయకపోవడం వల్ల ఆమె రాలేదని అదే అదునుగా భావించి ముంబైలో హోటల్ రూమ్లో తన మీద అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం జరిగిన తర్వాత బయట విషయం చెబితే తన ఉద్యోగం నుంచి పీకేయడమే గాక అసలు టాలీవుడ్ లో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడట. తర్వాత హైదరాబాద్ వచ్చినా ఏమాత్రం తగ్గలేదని వేధింపులు ఇంకా కొనసాగాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కేరవాన్ లో ఉన్న సమయంలో ప్యాంట్ తీసి తన మీద పశువులాగా ప్రవర్తించేవాడని అతని మాట వినకపోతే తలను బలంగా అద్దానికి వేసి కొట్టేవాడని జుట్టు పీకే వాడని ఇలా రకరకాల బాధలు పెట్టేవాడని అని చెప్పుకొచ్చింది.

అంతే కాదు ఇబ్బందులు పెడుతూ అందరి ముందు అసభ్యకరంగా టచ్ చేసేవాడని ఆమె చెప్పుకొచ్చింది. మరో సంచలన ఆరోపణ ఏమిటంటే తాను ఒకరోజు గుడి నుంచి వస్తుంటే తనను ఒక గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడని, ఇంటి వద్ద ఒక పార్సిల్ లో కూడా బెదిరింపు వార్నింగ్స్ వచ్చేవని చెప్పుకొచ్చింది. అంతేకాక తన భార్యతో కలిసి ఒకసారి ఇంటికి వచ్చి మతం మారాలని ఒత్తిడి చేయడమే కాదు, మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని కూడా జానీ మాస్టర్ బలవంతం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. ఇదంతా పూర్తిగా ఆమె వెర్షన్. ఆమె పోలీసులకు ఇచ్చిన సమాచారం. అయితే అక్కడ ఏం జరిగిందో ఆమెకు జానీ మాస్టర్ కు తప్ప ఎవరికీ తెలియదు. ఇప్పుడు జానీ మాస్టర్ ఈ విషయాన్ని ఖండించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఖండించకపోగా అసలు అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. నిజానికి జానీ మాస్టర్ మీద పడ్డ ఆరోపణలు, మామూలు ఆరోపణలు కాదు. నిజంగా ఆయన తప్పు చేయకుండా ఉండి ఉంటే ఈపాటికి మీడియా ముందుకు వచ్చి ఏదైనా ఆధారాలు ఉంటే తనను అరెస్ట్ చేసుకోవచ్చని, తాను తప్పు చేస్తే ఎలాంటి శిక్ష అనుభవించడానికి అయినా రెడీ అని చెప్పుకొని ఉండవచ్చు. కానీ అసలు జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా పోవడం ఇప్పుడు అనేక సంచలనాలకు కారణమవుతోంది ఆయనను రాజకీయంగా కాస్త ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నించిన జనసేన పార్టీ సైతం ఆయనను పార్టీలో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సూచించింది.

ఆయన అధ్యక్షుడిగా ఉన్న కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కూడా ఆయన్ని అధ్యక్షుడు పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తుంది. ఒకరకంగా ఇదేం పని అనే మాట అందరి నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన తప్పు చేశాడా లేదా అనేది కోర్టు తేలుస్తుంది లేదా చట్టాలు తేలుస్తాయి కానీ కనీస బాధ్యతగా మీడియా ముందుకు కానీ సోషల్ మీడియా వేదికగా గాని ఆయన తన వెర్షన్ చెప్పకపోవడం ఆయన తప్పు చేశాడేమో అని అనుమానాలు మరింత పెంచేలా మారిపోతుంది. మరి ఈ విషయంలో జానీ మాస్టర్ ఎందుకు మౌనం వహిస్తున్నాడో ఆయనకే తెలియాలి.