NTV Telugu Site icon

Vijay Sethupathi: ‘బెగ్గర్’ అంటున్నారు.. ఆగలేక పోతున్నాం సార్!

Puri Jaganath

Puri Jaganath

వరుస డిజాస్టర్ సినిమాల తర్వాత పూరి జగన్నాథ్ ఇప్పుడు విజయ సేతుపతితో సినిమా చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు తమిళంలో స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. సేతుపతి చేసే సినిమాలకు తెలుగులో కూడా మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు కథ చెప్పి ఒప్పించిన పూరీ జగన్నాథ్ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఒక హిట్ తర్వాత రెండు భారీ డిజాస్టర్లు వచ్చిన క్రమంలో పూరి జగన్నాధ్ అసలు ఎవరైనా హీరోని ఒప్పించ గలుగుతాడా అనే అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఏకంగా విజయసేతుపతి లాంటి హీరోకి కథ చెప్పి ఒప్పించడంతోనే సగం సక్సెస్ అయినట్లు భావిస్తున్నారు. అంతేకాకుండా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకే సిటింగ్లో విజయ్ సేతుపతి ఈ కథ ఓకే చేశాడు. దానికి తోడు ఎప్పుడెప్పుడు సినిమా మొదలు పెడతామా అని ఆయన ఆసక్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ED Raids: జార్జ్ సోరోస్-సంబంధిత సంస్థలపై ఈడీ దాడులు..

నిజానికి ఉగాది రోజు అనౌన్స్మెంట్ ఉంటుందని భావించారు కానీ అది కష్టమే అని తెలుస్తోంది. ఎందుకంటే విజయ్ సేతుపతితో సినిమాకి సంబంధించిన ఒక ఫోటో షూట్ చేసి ఆ తర్వాత ఆ లుక్ తో కూడిన అనౌన్స్మెంట్ చేయాలని పూరీ జగన్నాథ్ భావిస్తున్నాడు. దీంతో ఉగాది రోజు అనౌన్స్మెంట్ కష్టమే అని అంటున్నారు. తర్వాత ఎప్పుడైనా వీలు చూసుకునే అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఫోటోషూట్ కూడా త్వరలోనే ముగించాలని భావిస్తున్నారు. ఇక పూరీ జగన్నాథ్ చెప్పిన కథ భీభత్సంగా నచ్చడంతో ఎప్పుడెప్పుడు సినిమా మొదలుపెడతామా అన్నట్టు సేతుపతి ఎదురుచూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది పూరీ జగన్నాథ్ కి ఒక పర్ఫెక్ట్ కం బ్యాక్ ఫిలింగా నిలవబోతుందని అంటున్నారు ఆయన సన్నిహితులు ఇక ఈ సినిమాలో క్యారెక్టర్ డిజైన్ చేసుకున్న తీరు విజయ్ సేతుపతికి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించవచ్చు అని అంటున్నారు. ఇక ఈ సినిమాకి బెగ్గర్ అని వర్కింగ్ టైటిల్ పెట్టాలని భావిస్తున్నారు.