NTV Telugu Site icon

Pushpa 2: నైజాంలో నెవర్ బిఫోర్ రేట్స్.. మరి ఏపీ పరిస్థితి?

Pushpa

Pushpa

మరి కొద్ది రోజులలో రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమాకి ఇప్పటినుంచి మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమా టికెట్లు రేట్ల గురించి ఇప్పటినుంచే చర్చ జరుగుతుంది అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా సుకుమార్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు ఇక ఈ సినిమాకి సంబంధించి నైజాం ప్రాంతంలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది ముందు రోజు రాత్రి 9:30 గంటల నుంచి స్పెషల్ షోస్ వేసుకునేందుకు అనుమతి ఇవ్వడమే కాదు 800 రూపాయల రేటు పెంచి అమ్ముకునేందుకు కూడా అవకాశం ఇచ్చింది . ఆ లెక్కన సింగిల్ స్క్రీన్స్ – రూ.1121, మల్టీప్లెక్స్ – రూ.1239 ప్రీమియర్ షోస్ కి పెంచి అమ్ముకొవచ్చు దీనికి జీఎస్టీ అదనం.

Pushpa2TheRule : పుష్ప -2 బుకింగ్స్ కోసం స్పెషల్ యాప్.. కాసేపట్లో బుకింగ్స్ ఓపెన్.!

ఇక మొదటి నాలుగు రోజులు, సింగిల్ స్క్రీన్స్ – రూ. 354 మల్టీప్లెక్స్ – రూ. 531 అమ్ముకోవచ్చు. అలాగే 5వ రోజు నుంచి 12వ రోజు నుంచి రూ. 300.9 & రూ. 472 అమ్ముకోవచ్చు. ఇక అలాగే 13 వ రోజు నుంచి 29 వ రోజు వరకు : రూ. 200.6 & రూ. 354 అమ్ముకోవచ్చు. అయితే ఏపీలో ఈ సినిమా టికెట్ రేట్లు ఎంత పెంచుకునే అవకాశం ఇస్తారు అనే విషయం మీద చర్చ జరుగుతోంది. నిజానికి చివరిగా రిలీజ్ అయిన పెద్ద సినిమా దేవర సినిమాకి ఎంత టికెట్ రేట్ అనుమతి ఇచ్చారు. అంతా ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగానే ఉంది కానీ నిర్మాతలు అంతకన్నా పెంచి అమ్ముకుంటామని కోరుతున్నారు. అయితే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అలాగే అల్లు అర్జున్ -టీడీపీ మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్న అది హాట్ టాపిక్ అవుతుందని చెప్పక తప్పదు.

ఎందుకంటే ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ అప్పటి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం వెళ్లి ప్రచారంలో పాల్గొనడం పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా జనసేన కార్యకర్తలతో పాటు టిడిపి కార్యకర్తలు కూడా అల్లు అర్జున్ మీద ఈ విషయంలో కాస్త కోపంగానే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ నందమూరి బాలకృష్ణ తో చేసిన అన్ స్టాపబుల్ షోలో మాత్రం బాలకృష్ణతో చాలా కలిసిపోయి కనిపించాడు దీంతో నందమూరి అభిమానులు కాస్త అల్లుఅర్జున్ మీద సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారని ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరిగింది ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాకి ఏపీలో ఎంత టికెట్ రేట్ పెంచి అమ్ముకునే అవకాశం కల్పిస్తారు? తెలంగాణ లాగానే ఇప్పటివరకు లేనివిధంగా రికార్డు స్థాయి అనుమతి ఇస్తే సొంత పార్టీ కార్యకర్తలు నుంచి అలాగే జనసేన కార్యకర్తల నుంచి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది చూడాలి. మరి చూడాలి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అని.