NTV Telugu Site icon

Samantha: సమంత మాటలకి అర్ధాలే వేరులే!

Samantha

Samantha

చాలాకాలం తర్వాత సమంత నటించిన ఒక ప్రాజెక్ట్, ప్రేక్షకుల ముందుకు వచ్చింది అదేంటి ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలేవి లేవు కదా అని ఆశ్చర్యపోవద్దు. ఆమె చేసిన సైటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఇది స్ట్రీమింగ్ కి వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలియదంటే ఎంత ప్రమోషన్స్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సిరీస్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన కొన్ని సీన్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా లిప్ కిస్ వ్యవహారం అయితే హాట్ టాపిక్ అయిపోయింది. సమంత హనీ బన్నీ వెబ్ సిరీస్ లో ఏ రేంజ్ యాక్షన్ కోసం కష్టపడింది అనేది అప్రస్తుతం అయిపోగా హీరోతో ఆమె రొమాన్స్ అంతకుమించి ఆమె పెట్టిన మూతి ముద్దు గురించి మాత్రమే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

నిజానికి సిరీస్ కి మిక్స్ రివ్యూస్ వస్తున్నాయి కానీ సమంత ముద్దు విషయంలో మాత్రం అందరూ ఒకటే మాట, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అని. మరి కొంతమంది అయితే కేవలం లిప్ లాక్ సీన్ మాత్రమే కాదు మరికొన్ని బోల్డ్ సీన్స్ లో కూడా రెచ్చిపోయి నటించిందని అంటున్నారు. నిజానికి మొదటిసారి సమంత పూర్తిస్థాయిలో బోల్డుగా నటించిన సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2. ఈ సిరీస్ రిలీజ్ అయినప్పుడు చాలామంది ఆమె మీద ఫైర్ అయ్యారు. ఈ సిరీస్ తర్వాతే అసలు చైతన్య సమంత మంచి గొడవలు వచ్చాయని కూడా అనుకున్నారు. ఇప్పుడు ఆ సిరీస్ కి మించి అన్నట్టుగా ఈ సిరీస్ లో ఆమె రెచ్చిపోయింది. నిజానికి సమంత కాస్త రొమాంటిక్గా కనిపించి చాలా కాలమే అయింది. ఆమెను ఇష్టపడే వాళ్ళు ఆమెలో ఉన్న ఈ రొమాంటిక్ యాంగిల్ ని చాలాకాలం నుంచి మిస్ అవుతున్నారు. ఇక అలాంటి వారికి ఒక ట్రీట్ లాగా ఈ లిప్ కి సీన్ దొరికింది.

దీంతో మా సమంత ఎంత అందంగా ఉందో చూశారా అంటూ ఆ సీన్ షేర్ చేస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అయితే సమంత ఇలాంటి సీన్ చేస్తుందని ఊహించడం కష్టమే. ఎందుకంటే దీనివలనే విడాకులు అయ్యాయని గతంలో ప్రచారం జరిగింది కాబట్టి. ఇలాంటి వాటికి ఆమె దూరంగా ఉంటుందని అందరూ భావించారు. దానికి తోడు ఈ మధ్య జరిగిన ఈవెంట్లో తాను సినిమా చేస్తే నరసింహనాయుడు లాగా ఉండాలి కానీ రానా నాయుడు లాగా ఉండకూడదు అంటూ కామెంట్ చేయడంతో ఆమె బోల్డ్ వ్యవహారాలకు దూరంగా ఉంటుందేమో అని అనుకున్నారు. ఆ మాటలు అన్న కొద్ది రోజులకే బోల్డ్ నెస్ కా బాప్ అన్నట్టుగా ఆమె చేసిన సిరీస్ లోని సీన్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఆమె మాటలకు అర్ధాలేమిటో ఆమెకే తెలియాలి.

Show comments