NTV Telugu Site icon

Sequels: ఇప్పుడు ఎందుకీ సీక్వెల్స్..?

Sequels

Sequels

NTV Special Story on Movie Sequels: సీక్వెల్స్.. ఈ మధ్య కాలంలో ఈ మాట చాలా కామన్ అయిపోయింది. సినిమా హిట్ అయితే చాలు వెంటనే ఆ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా టైటిల్ అదే ఉంటుంది. హీరోలు కూడా సేమ్ ఉంటారు. హీరోయిన్ చేంజ్ అండ్ మూవీ థీమ్ కూడా పూర్తిగా మార్చేస్తారు. అసలు ఫస్ట్ మూవీ హిట్ అయ్యిందే ఆ థీమ్ వల్ల అని పూర్తిగా మర్చిపోతారు. అందుకేనేమో ఈ సీక్వెల్స్ లో 90% ఫ్లాపులుగా మారుతున్నాయి. అసలు ఒక మంచి క్లాసిక్ మూవీని తీసుకొని అవసరం లేకపోయినా దానికి సీక్వెల్ చేసి యాక్టుల్ మూవీని, ఆ పేరును పూర్తిగా పాడు చేస్తున్నారు. బాహుబలి తర్వాత ఇలా సీక్వెల్స్ తీయడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. అంటే అంతకుముందు ఇలా సీక్వెల్స్ లేవు అని కాదు. ఆ తర్వాత బాగా ఎక్కువయ్యాయి.

అసలు సీక్వెల్స్ అవసరమా..? ఒక యాంగిల్ లో చూస్తే ఎస్ సీక్వెల్స్ అవసరమే.. అది ఎలాంటి సినిమాలకు..? బాహుబలి వంటి సినిమాలకు చాలా అవసరం. ఎందుకంటే అది ఒక కంటిన్యూషన్ స్టోరీ. అంత పెద్ద స్టోరీని ఒక్క సినిమాలో చెప్పలేక రెండు పార్ట్స్ గా తీశారు. హాలీవుడ్ లో కూడా హ్యారీ పాటర్, ది మమ్మీ, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్, బ్యాట్ మ్యాన్ ట్రయాలజి.. ఇలా చాలా సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి. ఈ సినిమాలు హిట్ అవ్వడానికి కారణం.. స్టోరీ లైన్ కంటిన్యూ అవ్వడం. ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యింది కదా.. ఆ పేరుతో సీక్వెల్ హిట్ అవుతుంది అని కాకుండా ప్రతీ పార్ట్ పైనా ప్రాపర్ గా దృష్టి పెట్టడం. అలాగని హాలీవుడ్ లో కూడా సీక్వెల్ గా తెరకెక్కిన ప్రతీ సినిమా హిట్ అయ్యిందా అంటే.. లేదు. సన్ ఆఫ్ మాస్క్, ఇండియానా జోన్స్: అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ, టెర్మినేటర్: డార్క్ ఫేట్ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఫస్ట్ సినిమా పేరుని చూసి జనాలు వస్తారనుకోవడమే.. దీనికి కూడా కారణం.

ఇక బాలీవుడ్ లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు సినిమా పేరు పక్కన 2 అని పెట్టి హీరో హీరోయిన్లు మార్చి మళ్లీ అదే సినిమా చేస్తున్నారు. అవి సీక్వెల్సో అర్థం కాదు.. రీమేక్లో అర్థం కాదు.. రీబూట్లో అర్థం కాదు. ఇక మన విషయానికి వస్తే మంచి మంచి క్లాసిక్ మూవీస్ ని తీసుకొని వాటికి సంబంధం లేకుండా సీక్వెల్స్ చేశారు. జస్ట్ యావరేజ్ సినిమా ఎలాగో హిట్ అయ్యింది అనుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమాలు సీక్వెల్ చేసిన.. ఇంకేం చేసినా పోయేదేమీ లేదు.. ఆడియన్స్ పైన రివెంజ్ అనుకుంటారు. కానీ క్లాసిక్ మూవీస్ ని సీక్వెల్స్ పేరుతో ఇలా చేస్తే ఆ సినిమా అభిమానులు కచ్చితంగా హర్ట్ అవుతారు. అసలు ఈ సీక్వెల్స్ కి ఆ హీరోలను అలా ఒప్పిస్తారో కూడా అర్థం కాదు.

అలాంటి కొన్ని సీక్వెల్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..

నెంబర్ 1 కిక్ :
కిక్ ఎంత అద్భుతమైన సినేమానో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి సినిమాకి సీక్వెల్ చేయాలి అనుకోవడమే తప్పు. మళ్లీ అందులో కిక్ తీసేసి.. కంఫర్ట్ అన్న టాగ్ తగిలించి కిక్ అనే ఆ ఫీల్ ని ఆడియన్స్ కు దూరం చేశారు. ఆ కంఫర్ట్ అనే పదానికి ఆడియన్స్ అసలు కనెక్ట్ అవ్వలేకపోయారు. సో ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న రవితేజ ఫ్యాన్స్ కిక్ 2 దెబ్బకు డిసప్పాయింట్ అయ్యారు.

నెంబర్ 2 గబ్బర్ సింగ్:
గబ్బర్ సింగ్ ఎలాంటి ఎపిక్ సినిమానో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే సాహసమనే చెప్పాలి. స్టోరీ పూర్తిగా మార్చేసి.. అసలు తెలుగు బ్యాక్ డ్రాప్ కూడా లేకుండా.. హిందీ సినిమా చూసిన ఫీలింగ్ తెప్పించారు. అందుకే ఈ సినిమా ఆడియన్స్ కు ఎక్కలేదు.

నెంబర్ 3 మన్మధుడు:
ఈ సినిమాకైతే ఇప్పటికి కూడా అభిమానులు ఉన్నారు. అసలు ఈ సినిమాకు సీక్వెల్ తీయాలను ఎలా అనిపించిందో. అది కూడా సినిమా రిలీజ్ అయిన 17 ఏళ్ల తర్వాత. ఈ సినిమా అయితే ఏ విషయంలో కూడా ఆడియన్స్ దగ్గర నుంచి మార్కులు కొట్టలేకపోయింది.

నెంబర్ 4 భారతీయుడు :
సీరియస్ గా చెప్పాలంటే భారతీయుడు సినిమాకు సీక్వెల్ తీయాలన్న ఆలోచనే క్రైమ్. అది కూడా 28 ఏళ్ల తర్వాత. ఫస్ట్ పార్ట్ పై పెట్టినంత ఫోకస్ ఈ సినిమాపై శంకర్ పెట్టలేకపోయారు. ఏ యాస్పెక్ట్ లో చూసిన కూడా మూవీ వర్త్ అనిపించదు. అసలు రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు వస్తోందో కూడా అర్థం కాదు. అసలు ఈ సినిమాను 28 ఏళ్ల తర్వాత ఎందుకు తీశారో అన్న విషయం మేకర్స్ కే తెలియాలి.

నెంబర్ 5 చంద్రముఖి:
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అందులో చంద్రముఖి ఒకటి. అసలు చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చేయాలనే థాట్ ఎలా వచ్చిందో కూడా అర్థం కాదు. అది కూడా ఒక్క సీక్వెల్ కాదు.. ఏకంగా రెండు సీక్వెల్స్ తీశారు. అందులో మొదటిది మన తెలుగు సినిమానే.. అదే నాగవల్లి. ఈ సినిమా కన్నడ మూవీ ఆప్తరక్షకు రీమేక్. చంద్రముఖి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయలేకపోయింది. అయితే రీసెంట్ గా 2023 అంటే చంద్రముఖి రిలీజ్ అయిన 18 ఏళ్ళ తర్వాత వచ్చింది చంద్రముఖి 2. ఈ మూవీకి నాగవల్లికి అసలు సంబంధమే లేదు. ఒకవేళ చంద్రముఖి 2 జరిగింది అంటే.. నాగవల్లి స్టోరీ జరగనట్టే. ఈ సినిమా కూడా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయింది. హారర్ మూవీ ఎక్స్పర్ట్ అయిన రాఘవ లారెన్స్ కూడా ఈ విషయాన్నీ జడ్జ్ చేయలేకపోయారు. అయితే ఈ చంద్రముఖి సంబంధించిన అన్ని సినిమాలకీ డైరెక్టర్ పి వాసు. చంద్రముఖి, ఆప్తమిత్ర, ఆప్తరక్ష వంటి సినిమాలతో పేర్క్షకులను కట్టిపడేసిన పి వాసు.. అది కంటిన్యూ చేయలేకపోయారు.

ఇవే కాదు ఇలాంటి సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పుడు కొంత మందికి డౌట్ రావచ్చు. అవసరం లేకపోయినా సీక్వెల్స్ తీసి హిట్టు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారు. టిల్లు స్క్వేర్, కార్తికేయ 2 ఇలా కొన్ని సినిమాలకు సీక్వెల్స్ అవసరం లేదు.. కానీ ఆ ఫస్ట్ మూవీ క్రియేట్ చేసిన మ్యాజిక్ పోకుండా కాపాడుకున్నారు ఆ మేకర్స్. సీక్వెల్స్ తీయడంలో ఎలాంటి తప్పులేదు. అయితే మొదటి సినిమా చేసిన ఆ మ్యాజిక్ ను ఆడియన్స్ కు అందించిన ఆ ఫీల్ ను డిస్టర్బ్ చేసేలాగైతే ఆ సీక్వెల్ ఉండకూడదు. అండ్ ఇట్స్ థాట్ సింపుల్.

Show comments