NTV Telugu Site icon

Lavanya – Raj Tarun: రాజ్ తరుణ్-లావణ్య.. మాకేంట్రా ఇదీ?

Raj Tarun Lavanya Issues

Raj Tarun Lavanya Issues

Netizens Wex up With Lavanya – Raj Tarun Issue: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఎంత దారుణ పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని మాజీ ప్రియురాలుగా, భార్యగా చెప్పుకుంటున్న లావణ్య చేసిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఈమధ్యే చార్జిషీట్‌ దాఖలు చేశారు. రాజ్ తరుణ్, లావణ్య కొన్నాళ్లు కలిసి జీవించారని, అందుకు లావణ్య సమర్పించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ప్రస్తుతానికి ఈ విషయం కోర్టులో ఉంది. ఇదంతా జరుగుతున్న సమయంలోనే లావణ్య రాజ్ తరుణ్ ముంబై ఫ్లాట్‌కి వెళ్లి అక్కడ మాల్వీ మల్హోత్రాతో కలిసి ఉన్న వీడియో షూట్ చేసి వదిలిన వీడియో వైరల్ అయ్యింది. రాజ్ తరుణ్ ముంబైలో నటి మాల్వీ మల్హోత్రాతో కలిసి సహజీవనం చేస్తున్నట్టు ఈ సందర్భంగా లావణ్య తెర మీదకు తెచ్చింది. ఈ ట్విస్టులు అన్నీ అయిపోయాయిలే అనుకుంటున్న సమయంలో మరో సారి మీడియా ముందుకు వచ్చింది లావణ్య.

Devara: ఇది కదా ఫాన్స్ కి కావాల్సింది.. దేవరా!!

లావణ్యకు చెందిన బంగారు ఆభరణాలను రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా దొంగిలించారని లావణ్య తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మంగళసూత్రంతో పాటు నాలుగు గాజులు, గొలుసు చోరీకి గురైనట్లు ఆమె తెలిపారు. వాటిని కొనుగోలు చేసిన బిల్లులను అందించగా, వాటి విలువ రూ. 12 లక్షలు అని వెల్లడించింది. ఈ క్లిష్ట సమయంలో తనకు మద్దతు ఇవ్వాలని ఆమె మీడియాను అభ్యర్థించింది. అయితే ఈ ఎపిసోడ్ గురించి మీడియాలో, సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. ఒక హీరో వ్యక్తిగత వివాదాన్ని మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఇంతగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందా? దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా ఎందుకు వారి గురించి ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్లు, లైవ్లు ఇస్తూ కవర్ చేస్తున్నారు అంటూ మీడియాను నెటిజన్లు ఏకిపారేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఒకానొక దశలో ప్రేక్షకులకు రాజ్ తరుణ్, లావణ్య అనే పేర్లు వింటేనే ఏంట్రా మాకు ఇది అనే ఫీలింగ్ కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి వీరిద్దరి వ్యవహారం తెర మీదకు వచ్చి కొన్ని నెలలే అయినా ఎందుకో ఆ పేర్లు వింటేనే బాబోయ్ మాకెందుకు ఇది అనిపించేలా పరిస్థితులు మారిపోయాయి. లావణ్య – రాజ్ తరుణ్ ఫోన్ కాల్స్ కొన్ని లీక్ అవడం లావణ్య వేరే వాళ్లతో బూతులు మాట్లాడుతున్న కొన్ని ఆడియోలు బయటికి రావడం ముందు ఆమె మీద ఉన్న ఇమేజ్ను పూర్తిగా మార్చేశాయి. ఇక ఆ తర్వాత కాలంలో ఇలాంటి అమ్మాయి బారి నుంచి రాజ్ తరుణ్ తప్పించుకుంటేనే మంచిదిలే అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా ఇది వారి వ్యక్తిగత వ్యవహారం. అయినా ప్రతి విషయంలో మీడియాకు లీకులు ఇస్తూ మీడియా కవరేజ్ కోరుకుంటుంది లావణ్య.

ఆమె కంటెంట్ కు వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మీడియా కూడా ఫోకస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో కాస్త సంయమనం పాటిస్తే రాజ్ తరుణ్ పర్సనల్ వ్యవహారం ఇంతగా రచ్చకు ఎక్కేది కాదేమో. ఏదేమైనా మాల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్ ఇద్దరూ ముంబైలో కలిసి కనిపించడం. తరువాత ఇప్పుడు లావణ్య దొంగతనం కేసు నమోదు చేయడం వంటి విషయాలు మళ్లీ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇలాంటి చెత్త అంతా చూపిస్తున్నారు అంటూ మీడియా మీద ఫైర్ అవుతూనే వాటికి ఎక్కువ వ్యూయర్ షిప్ వచ్చేలా చేస్తున్నారు ప్రేక్షకులు. కాబట్టి ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఏమో. మొత్తానికి రాజ్ తరుణ్ ఇప్పటికైనా లావణ్యతో కూర్చుని మాట్లాడుకుని ఒక రకంగా ఈ విషయానికి స్వస్తి పలికితే తప్ప మీడియాకు, ప్రేక్షకులకు ఈ విషయంలో బ్రేక్ దొరికేటట్టు కనపడటం లేదు.

Show comments