NTV Telugu Site icon

Naga Vamsi: ఫేక్ కలెక్షన్స్ పుట్ట కదిపిన నాగవంశీ

naga vamsi

naga vamsi

Naga Vamsi Comments on Devara Collections: గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా కలెక్షన్స్ గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. నిజానికి మొదటి రోజే 173 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించినట్లు సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కలెక్షన్స్ విషయంలో అనుమానాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కావాలని తక్కువ కలెక్షన్స్ వచ్చినా వాటిని ఎక్కువ చేసి చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేశారు. యాంటీ ఫ్యాన్స్ అయితే వాటిని పట్టుకొని కావాలని జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి కలెక్షన్స్ లేకపోయినా ఏదో కోట్లలో కలెక్షన్స్ వచ్చి పడుతున్నాయి అని ప్రమోట్ చేస్తున్నారు అనే ఆరోపణలు తెరమీదకి తెచ్చారు. ఇప్పుడు ఈ ఫేక్ కలెక్షన్స్ పుట్టను తాజాగా నిర్మాత నాగవంశీ కదిపినట్టు అయింది. ఈ రోజు నాగ వంశీ నిర్మాణంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే ఆ ప్రెస్ మీట్ లో దేవర సినిమా కలెక్షన్స్ గురించి మీడియా ప్రశ్నలు సంధించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎంత కలెక్షన్స్ వచ్చాయో అంత కలెక్షన్స్ రిపోర్టు చేశానని తాను చెప్పినట్టు అంత కలెక్షన్స్ వచ్చాయని మీడియా నమ్మకపోతే తన తప్పేంటి అన్నట్టు ఎదురు ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ కలెక్షన్స్ రిపోర్ట్ రిలీజ్ చేయడం అనేది అభిమానుల కోసమే అని హీరోల అభిమానులను సాటిస్ఫై చేయడం కోసమే ఇలా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. నిజానికి ఇక్కడ నాగవంశీ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పులేదు తాను నిజాయితీగానే కలెక్షన్స్ రిపోర్టు రిలీజ్ చేశానని వాటిని ఆధారంగా చేసుకుని నిర్మాణ సంస్థ కూడా అంతే నిజాయితీగా కలెక్షన్స్ రిపోర్టు చేసిందని నాగ వంశీ చెప్పుకొచ్చారు. అయితే ఆయన మాటలను వక్రీకరించి ఇప్పుడు యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాటిని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంత నిస్సిగ్గుగా డిస్ట్రిబ్యూటర్ కలెక్షన్స్ ఫేక్ అని చెప్పినా సరే ఇంకా దేవరని హిట్ అని ఎలా అనుకుంటున్నారు అంటూ ఒక టాక్ మొదలుపెట్టారు.

దానికి తోడు అభిమానులను సాటిస్ఫై చేయడం కోసం పోస్టర్లు రిలీజ్ చేస్తున్నామని చెబితే వాటిని ఫేక్ చేసి రిలీజ్ చేస్తున్నామని అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టేశారు. నిజానికి నాగవంశీ మాట్లాడిన దాంట్లో ఎలాంటి కాంట్రవర్సీ లేదు. కానీ ఇప్పుడు యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నిజానికి గ్రాస్ కలెక్షన్లకు షేర్ కలెక్షన్లకు ఉన్న తేడా ఏంటో ఇన్కమ్ టాక్స్ వాళ్లకు కూడా తెలుసు అంటూ నాగ వంశీ చెప్పుకొచ్చారు. వాటిని కూడా తమకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు యాంటీ ఫ్యాన్స్ వాడేసుకుంటున్నారు. మొత్తం మీద ఈ ప్రచారం సంగతి ఎలా ఉన్నా దేవర 15 రోజులు క్రితం రిలీజ్ అయింది. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే బాగానే వస్తున్నాయి. సినిమా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని నాగ వంశీ చెప్తున్నారు. అయినా సరే ఆయన ఈ ఫేక్ కలెక్షన్స్ పుట్టను ఒక్కసారిగా కదిపినట్టు అయింది.

Show comments