Site icon NTV Telugu

JD Lakshmi Narayana Podcast: రాజకీయ ఎంట్రీకి కారణాలు ఇవే.. పాడ్‌కాస్ట్‌లో జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ..

Jd Lakshminarayana

Jd Lakshminarayana

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తన రాజకీయ ఎంట్రీకి ఎక్కడ బీజం పడిందో చెప్పారు. ఆయన తాజాగా @ Exclusive Podcast with NTV Teluguలో పాల్గొన్నారు. పాఠశాల నాటి పరిస్థితులు, రాజకీయంపై ఆసక్తి పెరగడానికి గల కారణాలు వివరించారు. తాను ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని.. అక్కడి నుంచే రాజకీయాలను అనుసరిస్తూ ఉండేవాళ్లమని తెలిపారు.

READ MORE: Hydrogen-Powered Train: హైడ్రోజన్ రైలు తయారీలో కీలక పురోగతి.. గంటకు 40వేల లీటర్ల నీరు చాలు..

“చిన్నతనంలో ఉన్నప్పుడే రాజకీయాలను అనుసరిస్తూ ఉండేవాళ్లం. మేము చదివిన పాఠశాల(గవర్నమెంట్) సమాజాన్ని మాకు పరిచయం చేసింది. మేము చిన్న కాలనీలో ఉండేవాళ్లం. పక్కన వాళ్లు, పేరెంట్స్ మాటలు వినేవాళ్లం. ఇప్పుడంటే చదువు తప్ప వేరే ధ్యాస లేదు. అప్పుడు అలా కాదు.. చదువుతో పాటు అన్ని విషయాలను మనకు పరిచయం చేసేవాళ్లు. అప్పట్లో ఉన్న టీచర్లు సైతం వీళ్లు రేపటి దేశ పౌరులుగా తయారవ్వాలన్న భావనతో అనేక విషయాలు పరిచయం చేసేవాళ్లు. తరగతి గదిలో కూడా చిన్న స్థాయిలో ఎన్నికలు కండక్ట్ చేసే వాళ్లు. అప్పటి నుంచే పాలిటిక్స్, పొలిటికల్స్ స్పీచ్‌లు, ఎన్నికలు గమనిస్తూ ఉండేవాళ్లము. ముఖ్యంగా హిందీ నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా ఉండేది. అటల్ బిహారీ వాజ్‌పేయి స్పీచ్‌లు వినేవాళ్లం. ఆయన మాటలు ప్రభావవంతంగా ఉంటాయి. టీవీలు కూడా లేవు. రేడియోల ద్వారా వినేవాళ్లం. 1977లో ఇందిరా గాంధీ మా ఊరు శ్రీ శైలానికి వచ్చారు. అప్పుడు వర్షం పడుతుంది. క్రౌడ్ చాలా తక్కు మంది వచ్చారు. ఆమె స్పీచ్‌ విందామని మేము కూడా అక్కడికి వెళ్లాం. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చాలా ముఖ్యమని భావనలు చిన్నతనంలోనే ఉన్నాయి. కాబట్టి స్కూల్స్, కాలేజీల్లో లీడర్ షిప్ అనేది అప్పటి నుంచే అలవాటు అయిపోయింది. ఈ విధంగా ఆ పొలిటికల్ టచ్ అందరికీ ఉండాలని నా అభిప్రాయం. ఇది ఒక బాధ్యత. సర్వీస్‌లోకి వచ్చిన తరువాత కూడా ప్రజలతో మమేకం అయ్యేవాడిని. మహారాష్ట్ర కూడా అటువంటి వాతావరణం ఉన్న రాష్ట్రం కాబట్టి కలిసొచ్చింది. అక్కడ చైతన్యవంతమైన ప్రజలు ఉండేవాళ్లు. పోలీసింగ్ చూస్తూనే ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యలను తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నాలు చేసేవాడిని.” అని వెల్లడించారు. ఇలా రాజకీయంపై ఆసక్తి పెరిగిందని వెల్లడించారు.

 

Exit mobile version