Site icon NTV Telugu

‘Lucky’ Dulquer : నిజంగానే లక్కీ దుల్కర్!

Dulquer Salmaan

Dulquer Salmaan

లక్కీ భాస్కర్ కాదు లక్కీ దుల్కర్ అంటున్నారు ఇప్పుడు ఆయన అభిమానులు. అసలు విషయం ఏమిటంటే దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయనకు అంతకుముందే పాన్ ఇండియా వైడ్ మార్కెట్ ఓపెన్ అయింది. కేవలం మలయాళం భాష దర్శకులు మాత్రమే కాదు, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ దర్శకులు సైతం ఆయనను దృష్టిలో పెట్టుకొని కథలు రాయడం మొదలు పెట్టారు.

Also Read:JanaSena: పార్టీ లైన్ దాటొద్దు.. జనసేన నేతలకు హెచ్చరిక..!

అందులో భాగంగా ముందుగా ఆయనకు కమలహాసన్ హీరోగా నటించిన ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ్ పాత్ర దక్కింది. అయితే ఏమనుకున్నాడో ఏమో, ఆ పాత్ర చేయలేనని చెప్పడంతో సిద్ధార్థ్ ఆ పాత్ర చేశాడు. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాలో కూడా శింబు చేయాల్సిన అమర్ పాత్ర దుల్కర్ సల్మాన్ చేయాల్సింది.

Also Read: NTR-Neel : 2వేల మందితో ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్..

అయితే ఏమనుకున్నాడో ఏమో, ఈ సినిమా కూడా తాను చేయలేనని చెప్పాడు. అలా తెలివిగా రెండు సినిమాలను ఆయన వద్దనుకున్నాడు. అయితే ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఏమాత్రం బాగులేదని పెదవి విరిచినవే రావడం గమనార్హం. ఒక పక్క ఆయన లక్కీ భాస్కర్ కాదు, లక్కీ దుల్కర్ అని కొంతమంది అంటుంటే, అందులో లక్కు ఏముంది, స్క్రిప్ట్ జడ్జ్‌మెంట్ కరెక్ట్‌గా ఉంది కాబట్టి ఆయన లక్కు బాగుందని మరికొందరు అంటున్నారు.

Exit mobile version