NTV Telugu Site icon

Space : అంతరిక్షంలో మనుషులు చనిపోతే.. మృతదేహాలను ఏం చేస్తారో తెలుసా?

Space1

Space1

అంతరిక్షంలోకి వెళ్లడమే పెద్ద సాహసం అనే చెప్పాలి.. ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకున్న వారే వెళ్తారు.. అంతరిక్షంలో రహస్యాలను చేధించేందుకు గానూ భారతదేశంతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలు అంతరిక్ష ప్రయాణాలు చేయడం సాధారణమైపోయింది. ఒకప్పుడు అంతరిక్ష ప్రయాణాలు చాలా అరుదుగా ఉండేవి. రానురాను ఈ అంతరిక్ష ప్రయాణాల పరంపర పెరుగుతోంది. 60ఏళ్ళ క్రితం అంతరిక్ష పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 60ఏళ్ళ కాలంలో అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా 20మంది మరణించారు.. అయితే అక్కడ మరణించిన వారి మృతదేహలను ఏం చేస్తారు అనే ప్రశ్నలు అందరికి వస్తాయి.. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిందని చెప్పాలి..

తాజాగా హ్యూస్టన్‌లోని బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన స్పేస్‌ మెడిసిన్‌, ఎమర్జెన్సీ ప్రొఫెసర్‌ ఇమాన్యుయేల్‌ ఉర్కెట సమాధానమిచ్చారు.. ఇక అలా చనిపోయిన వారిని కొన్ని గంటల వ్యవధిలోనే భూమీదకు తీసుకొస్తారు.. అదే విధంగా చంద్రును మీదకు వెళ్లినప్పుడు చనిపోతే కొన్ని రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు.. స్థిరమైన ఉష్ణోగ్రత ఉండే వ్యోమనౌకలో నుంచి స్పేస్‌సూట్‌ లేకుండా వ్యోమగామి చంద్రుడు, అంగారకుడిపై అడుగుపెడితే వాతావరణ కారణాలతో వెంటనే ప్రాణాలు కోల్పోతారు. అంతరిక్షంలో మృతదేహాలను దహనం చేయడం వల్ల మృతదేహాలపై ఉండే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్యక్రిములు అక్కడి వాతావరణంలో కలిసిపోయి కలుషితం చేస్తాయి..

అందుకే మృత దేహాలను భద్ర పరచి కుటుంబసభ్యులకు అందచేస్తారు.. 60 ఏండ్ల క్రితమే అంతరిక్ష యాత్ర మొదలైంది. ఇప్పటివరకు 20 మంది వ్యోమగాములు మరణించారు. 1986 నుంచి 2003 వరకు నాసా నిర్వహించిన ప్రయోగాల్లో 14 మంది చనిపోగా, 1967లో జరిగిన అపోలో లాంచ్‌ప్యాడ్‌ అగ్ని ప్రమాదంలో ముగ్గురు, 1971లో నిర్వహించిన సోయుజ్‌ 11 ప్రయోగంలో మరో ముగ్గురు వ్యోమగాములు మరణించారు. ఇకపోతే భూమికి దగ్గరగా ఉండే గ్రహాల మీద చనిపోతే భూమీదకు కొన్ని గంటల వ్యవధిలోనే తీసుకురావచ్చునని.. అదే 300 మిలియన్‌ మైళ్ల దూరంలోని అంగారకుడిపై మరణం సంభవిస్తే మాత్రం ఆ మృతదేహాన్ని తీసుకురావడం ఆలస్యమవుతుంది. మిషన్‌ను మధ్యలో ఆపేసి మిలియన్‌ మైళ్ల దూరం నుంచి అర్ధాంతరంగా వారు తిరిగిరాలేరు.. కొన్ని ఏళ్లు పడుతుంది.. మృతదేహాలను భద్ర పరచి తీసుకొని వస్తారు.. కొన్ని కెమికల్స్ వాడి బాడీని స్టోర్ చేస్తారని చెబుతున్నారు..