కూతురంటే ఏ తండ్రీకైనా ప్రేమ ఉంటుంది.. వారి అనుబంధం గురించి మాటలు లేవు.. ఇక రావు.. విడదీయని బంధం ఇది.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కూతురుపై ప్రేమను చూపిస్తారు.. అదే విధంగా యూకేకి చెందిన ఓ వ్యక్తికి తన కూతురంటే ఎంత ప్రేమంటే చెప్పలేని ప్రేమతో ఆమె పేరును 667 సార్లు టాటూలు వేయించుకున్నాడు. ప్రపంచ రికార్డు సాధించాడు. నిజమే.. నిజంగా గ్రేట్ కదూ.. అదే ఇప్పుడు ప్రపంచం ప్రశంసలు అందుకుంటుంది.. వివరాల్లోకి వెళితే..
యూకేకి చెందిన 49 సంవత్సరాల మార్క్ ఓవెన్ ఎవాన్స్ శరీరంపై ఒకే పేరును ఎక్కువసార్లు వేయించుకున్న వ్యక్తిగా ప్రపంచ రికార్డుసాధించాడు. అదీ తన కూతురి పేరుని 667 సార్లు టాటూగా వేయించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. 2017 లో ఓవెన్ ఎవాన్స్ తన కూతురు లూసీ పేరును తన వీపుపై 267 సార్లు టాటూ వేయించుకున్నాడు. అలా అప్పట్లోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పొందాడు. అయితే 2020 లో USA కి చెందిన 27 సంవత్సరాల డైడ్రా విజిల్ అతని రికార్డును అధిగమిస్తూ 300 టాటూలు వేయించుకుంది..
ఆ రికార్డ్ ను డబుల్ చెయ్యాలని రికార్డ్ ను బ్రేక్ చెయ్యాడాలని అనుకున్నాడు.. అంతే కష్ట పడ్డాడు.. లూసీ అని మరో 400 టాటూలు వేయించుకున్నాడు. దాంతో మొత్తం కలిపి 667 టాటూలుగా మారింది. ఈసారి అతను తొడలపై టాటూలు వేయించుకున్నాడు. ఒక్కో తొడపై 200 చొప్పున 400 టాటూలు వేసినందుకు ఇద్దరు టాటూ ఆర్టిస్టులకు ఐదున్నర గంటల సమయం పట్టింది. మొత్తానికి ఎవాన్స్ కూతురి పేరుతో అత్యధిక టాటూలు వేయించుకుని ప్రేమను చాటుకుంటూనే మరోవైపు ప్రపంచ రికార్డు సైతం సొంతం చేసుకున్నాడు.. ఆయన ప్రేమతో అందరికి షాక్ ఇచ్చాడు..రికార్డు బ్రేక్ చేశాడు..
Mark Evans has dedicated his body to his daughter Lucy by getting her name tattooed 667 times.https://t.co/rBRXCHnFH2
— Guinness World Records (@GWR) September 11, 2023