Site icon NTV Telugu

Zomato: జొమాటోకు జీఎస్టీ భారీ షాక్.. నోటీసులో ఏముందంటే..!

Zomoto

Zomoto

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు భారీ షాక్ తగిలింది. రూ.184 కోట్లకు పైగా సర్వీస్ ట్యాక్స్, పెనాల్టీ ఆర్డర్ అందిందని జొమాటో పేర్కొంది. ఇప్పటికే ఐటీ శాఖ నుంచి పలు ట్యాక్స్ డిమాండ్ నోటీసులు అందుకున్న జొమాటోకి తాజాగా ఢిల్లీలోని సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ నుంచి రూ.184.18 కోట్ల జీఎస్టీ నోటీసు జారీ అయింది. 2014 నుంచి జూన్ 2017 వరకు కంపెనీకి చెందిన విదేశీ అనుబంధ సంస్థలు, కంపెనీ బ్రాంచ్ లు భారత్ బయట ఉన్న శాఖలు, దాని కస్టమర్లకు చేసిన నిర్దిష్ట విక్రయాలపై సర్వీస్ ట్యాక్స్ చెల్లించని కారణంగా ఈ నోటీస్ పంపినట్లు ఐటీ శాఖ తెలిపింది. దానికి ప్రతిస్పందనగా ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో సహా తగిన పత్రాలు, న్యాయపరమైన పూర్వాపరాలతో పాటు వివరణ ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది. అయితే తాము అందించిన ఆధారాలను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని జొమాటో ఆరోపించింది.

ఇది కూడా చదవండి: Family Star: ఫ్యామిలీ స్టార్ ఈవెంటుకి బైకుపై వెళ్లిన విజయ్, మృణాల్

ఏప్రిల్ 1న ఢిల్లీ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వు తమకు అందిందని కంపెనీ తెలిపింది. దీనిపై తాము న్యాయపరంగా పోరాడతామని జొమాటో స్పష్టం చేసింది. అక్టోబరు 2014 నుండి జూన్ 2017 కాలానికి సంబంధించి ఈ ఆర్డర్‌ను అందుకున్నట్లు జొమాటో వెల్లడించింది. జరిమానాగా రూ. 92,09,90,306 సర్వీస్‌ ట్యాక్స్‌ కింద రూ92,09,90,306.. మొత్తం కలిపి రూ.184 కోట్లకు డిమాండ్‌ అందుకున్నట్లు జొమాటో పేర్కొంది. దీనిపై కోర్టులో అప్పీల్‌కు చేస్తామని కంపెనీ తెలిపింది.

ఇది కూడా చదవండి: Kakarla Suresh: వృద్ధులకు, వికలాంగులకు ఇతర పింఛన్ లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్ అందివ్వాలి..

Exit mobile version