NTV Telugu Site icon

Zero Polling: ఆ ఆరు జిల్లాలో జీరో పోలింగ్..

Zero Voting

Zero Voting

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా నాగాలాండ్‌లో అరుదైన రికార్డు నెలకొంది. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎంపీ సీటుకు శుక్రవారం నాడు పోలింగ్‌ జరిగింది. అయితే, ఈ పోలింగ్‌కు ఆరు జిల్లాల ప్రజలు దూరంగా ఉన్నారు. ఈ ఆరు జిల్లాల్లో ఉన్న నాలుగు లక్షల ఓటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఒంటి గంట వరకు ఓటు వేసేందుకు రాకపోవడం గమనార్హం. ఆరు జిల్లాలు కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్‌ను పరిష్కరించకపోవడం వల్లే ఈ రోజు జరిగే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ది ఈస్టర్న్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ (ENPO) పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో ఆ ఆరు జిల్లాలోని ప్రజలు ఎవరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాలేదు.

Read Also: Lok sabha election: ముగిసిన తొలి విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..!

ఇక, ఈ ఆరు జిల్లాల్లో ఈఎన్‌పీవో పబ్లిక్‌ ఎమర్జెన్సీని ప్రకటించడంతో.. ఆరు జిల్లాలతో కలిపి ఫ్రాంటియర్‌ నాగాలాండ్‌ టెరిటరీ( FNT) ఏర్పాటు చేయాలని ఈఎన్‌పీవో పోరాటం చేస్తుంది. మొత్తం ఆరు గిరిజన సంఘాలు కలిసి ఈఎన్‌పీవోను ఏర్పాటు చేశాయి. ఇక, ఈఎన్‌పీవో ప్రత్యేక రాష్ట్ర హోదా – ఫ్రాంటియర్ నాగాలాండ్ – 2010 నుంచి డిమాండ్ చేస్తోంది. మోన్, ట్యూన్‌సాంగ్, లాంగ్‌లెంగ్, కిఫిర్, షామటోర్, నోక్లాక్ అనే ఆరు జిల్లాలతో కూడిన తమ ప్రాంతం అన్ని రంగాలలో నిర్లక్ష్యం చేయబడిందని వారు పేర్కొంటున్నారు. 60 మంది సభ్యులున్న నాగాలాండ్ అసెంబ్లీలో ఈఎన్‌పీవో ప్రాంతంలో 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.