NTV Telugu Site icon

Zee : జీ తెలుగు కుటుంబం అవార్డ్స్​ 2024.. నేటి సాయంత్రం 6 గంటలకు.. జీ తెలుగులో..!

Whatsapp Image 2024 10 12 At 11.42.27 Am

Whatsapp Image 2024 10 12 At 11.42.27 Am

Zee : నిరంతరం ప్రేక్షకులకు వినోదం అందిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న ఛానల్​ జీ తెలుగు. ఎదురులేని ప్రయాణంలో ఛానల్​ఉన్నతికి తమవంతు కృషి చేస్తున్న ప్రతిభావంతులైన నటీనటులు, కళాకారులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు.. అందరినీ గౌరవిస్తూ అందించే సత్కారమే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్​. ప్రతిష్ఠాత్మక జీ తెలుగు కుటుంబ అవార్డులను అందుకుని మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని నటీనటులను ప్రోత్సహిస్తుంది. ప్రతి ఏటా ఘనంగా జరిగే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేడుక ఈ సంవత్సరం మరింత వైభవంగా జరిగింది. జీ తెలుగు తారలు, టాలీవుడ్​ ప్రముఖులతో సందడిగా సాగిన జీ తెలుగు కుటుంబం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమ మొదటి భాగం అక్టోబర్ 12 సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!

టాలీవుడ్​ ప్రముఖులు, బుల్లితెర నటీనటులతో సందడిగా సాగిన జీ తెలుగు కుటుంబం అవార్డ్స్​ 2024 పార్ట్​ 1 కార్యక్రమానికి ఎనర్జిటిక్​జోడీ రవి‌‌- లాస్య యాంకర్లుగా వ్యవహరించారు. జీ తెలుగు సీరియల్స్​ కుటుంబాలన్నీ కలగలసి ఊరేగింపుతో ఘనంగా మొదలైన కార్యక్రమం అద్భుత ప్రదర్శనలు, అనుభవాలు, భావోద్వేగాల సమాహారంగా సాగుతుంది. ఇక, జీ తెలుగు పాపులర్​ సీరియల్స్​ పడమటి సంధ్యారాగం, నిండు నూరేళ్ల సావాసం నటీనటులు ఆడే ఫజిల్​ గేమ్​ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. టాలీవుడ్​ సీనియర్ నటీనటులు​ భానుచందర్, అర్చన ఈ కార్యక్రమానికి హాజరై తమ అనుభవాలను పంచుకుని నవ్వులు పూయించారు. జీ తెలుగు సీరియల్ జంటలతో సాగే మ్యూజికల్ డాన్స్ వార్​లో సరిగమప సింగర్స్ పోటాపోటీ ప్రదర్శన ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ వేడుకకు మెగాబ్రదర్​నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై జీ తెలుగుతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్న సందర్భంగా డ్రామా జూనియర్స్ చిన్నారుల ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది.

యాక్షన్ ప్రియుల కోసం లైవ్​లో గగన్ రౌడీలతో చేసే ఫైట్ సీక్వెన్స్ ఆసక్తికరంగా సాగుతుంది. డాన్స్​ కాంపిటీషన్లో భాగంగా జూనియర్లు రెట్రో ప్రదర్శన ఇవ్వగా, సీనియర్లు ట్రెండింగ్ పాటలకు డాన్స్​​ చేసి అలరిస్తారు. రామలక్ష్మి & శౌర్య, ఆద్య & శ్రీను, రూప & రాజు, శ్రీకర్ & అవని జంటలు వేదికపై చేసే సందడి సరదాగా సాగుతుంది. సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ, వై.విజయ సీరియల్ కోడళ్లతో చేసే సంభాషణ కడుపుబ్బా నవ్విస్తుంది. అద్భుతమైన ప్రదర్శనలతో వినోదంగా సాగే ఈ కార్యక్రమంలో మీ అభిమాన నటులు ఏ అవార్డు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్​ 2024 కార్యక్రమాన్ని మిస్​ కాకుండా చూసేయండి.
రెడ్​ కార్పెట్​పై వెండితెర ప్రముఖుల సందడి.. బుల్లితెర తారల హంగామా.. అక్టోబర్​ 11​ శుక్రవారం రాత్రి 10:30 గంటలకు, జీ తెలుగు కుటుంబం అవార్డ్స్​ 2024 పార్ట్​ 1 అక్టోబర్​ 12 శనివారం సాయంత్రం 6 గంటలకు.. మీ జీ తెలుగులో!

Read Also: BB 4 : హిట్ కాంబో..బాలయ్య, బోయపాటి మ‌రో చిత్రానికి ముహూర్తం ఫిక్స్

Read Also: Visvambhara : గూస్ బంప్స్ తెప్పించిన విశ్వంభర టీజర్.. ఇది వేరే లెవల్

Show comments