విశాఖపట్నంలోని పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ బహిరంగ సభలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. వైసీపీ గోపాలపట్నంలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు, మహిళలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన యాత్రలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన సూచించారు. మోసం చేసే హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారు.. టీడీపీ, టీడీపీకి తొత్తుగా వ్యవహరించే జనసేనకు ఓటేస్తే నష్టం తప్పదు అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
Read Also: INDIA bloc: ఇండియా కూటమిలో లుకలుకలు.. కాంగ్రెస్‌పై అఖిలేష్ యాదవ్ విమర్శలు..
సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న కోట్లాది మందికి నష్టం జరుగుతుంది అని వైవీ వైవీసుబ్బా తెలిపారు. పశ్చిమ నియోజక వర్గం మీద సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.. సమన్వయకర్త, వైసీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్ గెలవబోతున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ రెడీ అయింది. వైసీపీ బస్సు యాత్ర చేపట్టనుంది అని ఆయన అన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు.
Read Also: Atchannaidu: ఎన్ని కేసులు బనాయించిన కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారు
ఇక, అక్టోబర్ 26న ఇచ్చాపురంలో వైసీపీ సామాజిక న్యాయ మొదటి విడత బస్సు యాత్ర స్టార్ట్ అవుతుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నవంబర్ 9న అనకాపల్లిలో మొదటి విడత బస్సుయాత్ర ముగిస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు ఆయన తెలిపారు. అక్టోబర్ 26వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు ఈ యాత్ర ప్రారంభమవుతుందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
