Yuvraj Singh likely to Join BJP ahead of Lok Sabha Elections 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాలని బీజేపీ చూస్తోంది. 400కు పైగా సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఎన్డీఏ కూటమి బరిలోకి దిగుతోంది. లోక్‌సభ ఎన్నికలపై ఇటీవలే బీజేపీ నేతలు, కార్యకర్తలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు రాష్ట్రాల్లో చేరికలపై దృష్టిపెట్టారు. నేమ్, ఫేమ్ ఉన్న సెలబ్రెటీలను పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బీజేపీలో చేరుతారన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
యువరాజ్ సింగ్ బీజేపీ టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి మాజీ ఆల్‌రౌండర్‌ను రంగంలోకి దింపాలని అధికార బీజేపీ చూస్తోందట. గురుదాస్‌పూర్ సిట్టింగ్ ఎంపీ సన్నీ డియోల్ స్థానంలో యువీకి బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. యువరాజ్ ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యువీ బీజేపీలో చేరుతున్నాడనే వార్తలకు బలం చేకూరింది.
Also Read: Abhishek Sharma: మోడల్ ఆత్మహత్య.. చిక్కుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్!
రెండు ప్రపంచకప్‌లు గెలిచిన భారత క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ గెలవడంతో యూవీ కీలక పాత్ర పోషించాడు. బ్యాట్, బంతితో రాణించి.. భారత జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌కు ముందు అన్ని రకాల క్రికెట్‌ల నుంచి యువరాజ్ రిటైర్‌మెంట్ తీసుకున్నాడు. అయితే రాజకీయాల్లో చేరాలనే కోరికను మాత్రం అతడు ఎప్పుడూ వ్యక్తం చేయలేదు. మరి చూడాలి యూవీ రాజకీయాల్లోకి వస్తాడో లేదో. యువరాజ్ సింగ్ భారత్ తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.