NTV Telugu Site icon

IML 2025: ఫైనల్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్, టినో బెస్ట్ మధ్య గొడవ.. వీడియో వైరల్

Yuvi

Yuvi

రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ఇండియా మాస్టర్స్- వెస్టిండీస్ మాస్టర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ జట్టు విజయం సాధించింది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ T20 ఫైనల్‌లో భారత దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ టినో బెస్ట్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇండియా మాస్టర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా యువరాజ్, బెస్ట్ మధ్య గొడవ జరిగింది.

Also Read:Kalyan ram : ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ నుండి పవర్ ఫుల్ టీజర్

బెస్ట్ తన ఓవర్ పూర్తి చేసిన తర్వాత గ్రౌండ్ వదిలి వెళ్లాలనుకున్నాడు. ఈ విషయం యువరాజ్ అంపైర్‌కు తెలియజేశాడు. దీంతో బెస్ట్ గ్రౌండ్ లోకి తిరిగి రావాల్సి వచ్చింది. ఇదంతా టినో బెస్ట్ కి నచ్చలేదు. ఈ సంఘటన 13 ఓవర్ల తర్వాత జరిగింది. టినో బెస్ట్ తిరిగి మైదానంలోకి వచ్చిన వెంటనే యువరాజ్ వైపు వెళ్లి వాదించడంతో హీట్ పెరిగింది. ఇద్దరు ఆటగాళ్ళు ఒకరికొకరు వేళ్లు చూపించుకుంటు గొడవపడ్డారు. పరిస్థితి మరింత దిగజారుతున్నట్లు గమనించిన అంపైర్, వెస్టిండీస్ మాస్టర్స్ కెప్టెన్ బ్రియాన్ లారా జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. అంబటి రాయుడు యువరాజ్ సింగ్‌ను విడదీస్తున్నట్లు కనిపించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఇది చూసిన యూవీ ఫ్యాన్స్ యూవీ ఆన్ ఫైర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read:Gold Rates Today: గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

ఇండియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో, బ్రియాన్ లారా జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ 17.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి టైటిల్ కైవసం చేసుకుంది. సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని జట్టు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ T20 మొదటి ఎడిషన్ విజేత జట్టుగా అవతరించింది.