NTV Telugu Site icon

Yulu Wynn: రూ.55 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. డ్రైవింగ్ లైసెన్స్‌తో పనేలేదు..!

Yulu Wynn

Yulu Wynn

Yulu Wynn: ఇప్పుడంతా ఎలక్ట్రిక్‌ వాహనాల హవా నడుస్తోంది.. పెట్రో ధరలు ఆల్‌టైం హై రికార్డు సృష్టించిన తర్వాత.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.. పర్యావరణాన్ని సంరక్షించేందుకు కూడా పూనుకుంటున్నారు.. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు చూస్తున్నాయి.. ఇండియన్ మార్కెట్‌లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతూ వస్తుంది.. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురాగా.. తాజాగా, యులు (Yulu) కంపెనీ వైన్ (Wynn) అనే ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసింది.. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 55,555 మాత్రమే.. అయితే, మరికొన్ని రోజుల తర్వాత దాదాపు రూ.10 వేల వరకు ఈ బైక్‌ ధర పెరుగుతుందని ఆ కంపెనీ ప్రకటించింది..

ఇక, ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 999 రిఫండబుల్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ బైక్ ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉండగా.. తర్వారలో మరిన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. వచ్చే నెల నుంచి కస్టమర్లకు ఈ బైక్‌ను అందజేయనున్నారు.. యులు వైన్ ఎలక్ట్రిక్ బైక్ కేవలం రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి స్కార్లెట్ రెడ్ కలర్, మూన్ లైట్ కలర్. యులు వైన్ ఎలక్ట్రిక్ బైక్ బజాజ్ చేతక్ యాజమాన్యంలో ఉన్న చేతక్ టెక్నాలజీస్ లిమిటెడ్ తయారు చేస్తోంది.. 984.3 వాట్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చారు. ఇది సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 68 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లుగా ఉంది.. కాబట్టి ఈ బైక్ రైడ్ చేయడానికి ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వం అవసరం ఉండవన్న మాట..

కంపెనీ ప్రకారం, ద్విచక్ర వాహనం దాని మొబిలిటీ సబ్‌స్క్రిప్షన్ ప్యాక్‌ల ద్వారా సరసమైన యాజమాన్య అనుభవాన్ని అందిస్తుంది, ఇది యాజమాన్యం యొక్క ముందస్తు ధరను 40 శాతం తగ్గిస్తుంది. కంపెనీ మొబిలిటీ సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీలను అందజేస్తుంది, కస్టమర్‌లు వారి అవసరాల ఆధారంగా వీటిని ఎంచుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా, 16 ఏళ్లు పైబడిన అన్ని వయసుల వారు దీన్ని నడపవచ్చు. ఇక, దీనికింద నెల చార్జీలు రూ. 499 నుంచి రూ. 899 వరకు ఉంటాయి. దీని వల్ల రైడింగ్ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. ఈ ప్లాన్ ద్వారా కిలోమీటరుకు 70 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. మరెందుకు ఆలస్యం.. సరమైన ధరకే వస్తున్న ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ను ఇప్పుడే బుక్‌ చేసుకోండి.. రూ.10 వేల వరకు ఆదా చేసుకోండి.

Show comments