ఒంటిమిట్టలో నామినేషన్ వేసిన దగ్గర్నుంచి టీడీపీ ముగ్గురు మంత్రులు సవిత, జనార్ధనరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి ప్రలోభాలకు గురిచేశారని ఒంటిమిట్ట వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నిక మొదలవుతుండగానే మా పార్టీకి చెందిన ఏజెంట్లను ఇబ్బంది పెట్టారు.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మూడు వందల మందితో వచ్చి తమ ఏజెంట్లపై దాడి చేయించారని.. మంత్రి సమక్షంలోనే దాడి జరగడంతో అక్కడికి వెళ్లిన తనను కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి బెదిరించారన్నారు. తాము ఏ పోలింగ్ బూత్ కు వెళ్లినా మమ్మల్ని అడ్డుకున్నారన్నారు. తమ మండలంలో ఇప్పటి వరకూ ఎన్నికలకు సంబంధించి చిన్న కేసు కూడా లేదని చెప్పారు. భవిష్యత్తు ఎన్నికల్లో మీకు ఏజెంట్లు కూడా ఉండరని గుర్తుచేసుకోవాలని హెచ్చరించారు. పోలీసులను పెట్టుకుని రిగ్గింగ్ చేసుకున్నారు.. తాము ప్రశాంతంగా ఉన్నాం కాబట్టే మీ ఆటలు సాగాయన్నారు. కౌంటింగ్ కు బాయ్ కాట్ చేస్తున్నామన్నారు..
READ MORE: ICC ODI Rankings: ఆడకున్నా అదరగొట్టిన రోహిత్ శర్మ.. టాప్-5లో ముగ్గురు మనోళ్లే!
మరోవైపు… వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేడు రి-పోలింగ్ జరుగుతోంది.
అచ్చువేల్లి, కొత్తపల్లె గ్రామాల్లో రిపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
