Read Also:Sonali Kulkarni: అమ్మాయిలకు అది ఎక్కువైంది.. అవసరాలు తీర్చే బాయ్ ఫ్రెండ్ కావాలి
తనకు ఓటు వేసి గెలిపించిన కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలోని ప్రతి ఉపాధ్యాయునికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వారిని తిప్పికొడుతూ ముందుకు వెళ్తానన్నారు. నా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్‌రెడ్డిపై 169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రామచంద్రారెడ్డి కి 10787 ఓట్లు రాగా, ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్‌రెడ్డి కి 10618 ఓట్లు వచ్చాయి. మూడో ప్రాధాన్యత ఓట్లతో ఎంవీ రామచంద్రారెడ్డి విజయం సాధించారు.
Read Also: Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడురోజులు భారీవర్షాలు