వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఆ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. సీబీఐ కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ప్రారంభం అయింది. ఢిల్లీ సీబీఐ ఎస్ పీ రామ్ సింగ్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. వివేకా హత్య జరిగిన రోజు…సాక్ష్యాలు తారుమారు చేశారు అన్న అంశాలపై అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు సీబీఐ.. ఏపీ నుంచి ఈ కేసు విచారణను హైదరాబాద్ కి తరలించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించాక…సీన్ రీకనస్ట్రక్షన్ లో లభించిన అధారాలపై అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు.
Read Also: Weather Update: ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు
ప్రత్యేకమైన గదిలో అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఇదిలా ఉంటే.. సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకున్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లు శ్రీకాంత్ రెడ్డి , శ్రీనివాస్. అవినాష్ రెడ్డిని అనవసరంగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అవినాష్ రెడ్డి విచారణ పారదర్శకంగా జరగాలని కోరారు. వైసీపీ అవినాష్ కు పూర్తి అండగా వుంటుందన్నారు. విచారణకు అంతా కూడా వీడియో రికార్డింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే లు శ్రీకాంత్ రెడ్డి , శ్రీనివాస్ సీబీఐ కార్యాలయం వద్దే వేచి ఉన్నారు. విచారణలో ఏం జరుగుతుందో వారు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
అవినాష్ రెడ్డి విచారణ ద్వారా ప్రజలకు నిజాలు తెలిసే అవకాశాలు ఉన్నాయన్నారు శ్రీకాంత్ రెడ్డి. కుటుంబసభ్యుల మధ్య చిచ్చు పెట్టాలని ప్రతిపక్ష టీడీపీ పార్టీ ప్రయత్నిస్తోంది..చంద్రబాబు మాదిరి ఈ రాష్ట్రం లోకి సీబీఐ రావొద్దు అనలేదు..రాజ్యాంగ బద్ధ సంస్థలను గౌరవించే వ్యక్తి సీ ఎం జగన్ మోహన్ రెడ్డి..అవినాష్ విజయమ్మను కలిసినా..రాజకీయం చేస్తున్నారు.మా అందరికీ విజయమ్మ పెద్ద దిక్కు..ఆమె దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు. హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో కూడా ఇప్పటికే తేలిపోయింది…అయినా..అవినాష్ రెడ్డి నీ రాజకీయంగా దెబ్బ తీయాలని జరుగుతున్న కుట్ర నే ఇది అని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Justice for SI-Constable: ఛలో డీజీపీ’ ముట్టడిలో పోలీసుల లాఠీ ఛార్జ్.. బండి సంజయ్ సీరియస్