Site icon NTV Telugu

Gorantla Madhav: మాజీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అరెస్ట్‌

Gorantla Madhav

Gorantla Madhav

Gorantla Madhav: Gorantla Madhav: వైసీపీ పార్టీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ సతీమణి భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిందితుడిగా ఉన్న చేబ్రోలు కిరణ్‌ను అందుపులోకి తీసుకున్నారు. ఇక అదుపులోకి తీసుకుంటున్న సమయంలో మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తున్న సమయంలో గోరెంట్ల మాధవ్ పోలీసు వాహనాన్ని వెంబడిస్తూ, ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల మాధవ్ చేయి చేసుకునే ప్రయత్నం, అలాగే ఎస్కార్ట్ వాహనాన్ని అడ్డగించడం వల్ల పోలీసుల విధులకు ఆటంకంగా భావిస్తూ ఆయనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గుంటూరు జిల్లాలో కొంత ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ మాధవ్‌ను అరెస్ట్ చేయడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.

Also Read: Allahabad HC: ‘‘అత్యాచారానికి ఆమెదే బాధ్యత’’.. బాధితురాలని తప్పుపట్టిన హైకోర్టు.. నిందితుడికి బెయిల్..

ఈ ఘటనపై గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ స్పందించారు. యూట్యూబ్ ఛానెల్ లో కిరణ్ మాజీ సిఎం భార్యపై అసభ్యకరంగా మాట్లాడాడని, దీంతో అతన్ని అరెస్టు చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో మొత్తం నాలుగు కేసులు కిరణ్ పై ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతడు హైదరాబాద్ లో ఉంటున్నాడని, ఇబ్రహీంపట్నం వద్ద అరెస్ట్ చేశామని తెలిపారు. మాజీ మంత్రి రజిని పై కూడా అసభ్యకరమైన పోస్టులు కిరణ్ పెట్టాడని, దానికి సంబంధించి కూడా కేసు నమోదైందని తెలిపారు. అయితే అతడిని ఆరెస్ట్ చేసి వాహనంలో తరలిస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ వెంబడించినట్లు సమాచారం ఉందని, ఈ విషయమై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని తెలిపారు.

Exit mobile version