Site icon NTV Telugu

YSR Awards-2023: రేపు వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరుకానున్న గవర్నర్, సీఎం జగన్

Ysr Awards

Ysr Awards

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులు-2023ని అందజేయనుంది. ఏపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు (బుధవారం) విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. అయితే, రేపు ( బుధవారం ) వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఏ1- కన్వెన్షన్ హాల్‌లో జరుగనుంది. వైఎస్సార్ అవార్డుల్లో 23 లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌, 4 ఎచీవ్‌మెంట్‌ అవార్డులు.. వ్యవసాయం, కళలు, సాంప్రదాయాలు, తెలుగు భాష– సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సమాజ సేవ రంగాల్లో ప్రతిభావంతులకు ఈ అవార్డులు అందజేయనున్నారు. ఆయా రంగాల్లో ఎంపికైన వారికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవార్డుల ప్రదానోత్సవం చేయనున్నారు.

Exit mobile version