వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లనున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి.. 11.30 గంటలకు కల్లితండాకు చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాలను పరామర్శిస్తారు.
Also Read: Janasena: సైన్యానికి దైవ బలం కోసం జనసేన పూజలు.. షష్ఠ షణ్ముఖ క్షేత్రాలకు ఎమ్మెల్యేలు!
మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ 12.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 తిరిగి బెంగళూరుకు చేరుకుంటారు. తిరిగి సాయంత్రం 5.45 గంటలకు బెంగుళూరు నుంచి తాడేపల్లికి బయలుదేరనున్నారు. రాత్రి 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 9.10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి జగన్ చేరుకోనున్నారు.
